పందులకు రెక్కలోస్తే... వాటిలో ఒకటి మీవైపే రాకెట్ లా దూసుకోస్తుంటే.. ఏమవుతుంది? హఠాత్తుగా మీరు గాడిదలా మారిపోతే.. ఆ విషయం ఎవరితోనూ చెప్పుకోడానికి బొత్తిగా అవకాశమే లేకపోతే అప్పుడేమవుతుంది? మీకు తెలిసిన మనుషులంతా మీ కళ్ళముందే ఎలుకలుగా పిల్లులుగా కుక్కలుగా పులులుగా సింహాలుగా మారిపోతూ ఉంటే.. ఆగండాగండి.. గతంలోకీ ఎడా పెడా మిమ్మల్ని తీసుకుపోయి వెనక్కి తీసుకురాగల ఒక కాలయంత్రమే మీకు లభిస్తే.. ఏమవుతుంది?
పందులకు రెక్కలొస్తాయేమో, కాని కాలయానం మాత్రం అసాధ్యం అని మీరు అనవచ్చు. అయితే తన భావనలే వెల్స్ కి ప్రధానం. వాటికి శాస్త్రీయ ఆధారం ఉందా లేదా అన్నది హెచ్ జి వెల్స్ కి పట్టదు. భవిష్యత్తులో మానవ సమాజం ఎలా ఉండబోతోందో మీ కళ్ళ ముందు ఆవిష్కరించడమే ఈ నవలలో ఆయన ముఖ్య లక్ష్యం. శాస్త్రపరమైన వివరాలను ఆయన అంతగా పట్టించుకోడు. అయినా ఆయనకు సైన్సు కథా పితామహుడు అన్న పేరుంది. Sci-Fic అనగానే మీకు వెల్స్ పేరు గుర్తు రాక మానదు.
కాల యంత్రం పుట్టి శతాబ్దం చాటింది. అప్పటికీ ఇప్పటికీ దాని ఆకర్షణ శక్తి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అది పాఠకులకు అలరిస్తూనే ఉంది. వివాదాలను రేపుతూనే ఉంది.
పందులకు రెక్కలోస్తే... వాటిలో ఒకటి మీవైపే రాకెట్ లా దూసుకోస్తుంటే.. ఏమవుతుంది? హఠాత్తుగా మీరు గాడిదలా మారిపోతే.. ఆ విషయం ఎవరితోనూ చెప్పుకోడానికి బొత్తిగా అవకాశమే లేకపోతే అప్పుడేమవుతుంది? మీకు తెలిసిన మనుషులంతా మీ కళ్ళముందే ఎలుకలుగా పిల్లులుగా కుక్కలుగా పులులుగా సింహాలుగా మారిపోతూ ఉంటే.. ఆగండాగండి.. గతంలోకీ ఎడా పెడా మిమ్మల్ని తీసుకుపోయి వెనక్కి తీసుకురాగల ఒక కాలయంత్రమే మీకు లభిస్తే.. ఏమవుతుంది? పందులకు రెక్కలొస్తాయేమో, కాని కాలయానం మాత్రం అసాధ్యం అని మీరు అనవచ్చు. అయితే తన భావనలే వెల్స్ కి ప్రధానం. వాటికి శాస్త్రీయ ఆధారం ఉందా లేదా అన్నది హెచ్ జి వెల్స్ కి పట్టదు. భవిష్యత్తులో మానవ సమాజం ఎలా ఉండబోతోందో మీ కళ్ళ ముందు ఆవిష్కరించడమే ఈ నవలలో ఆయన ముఖ్య లక్ష్యం. శాస్త్రపరమైన వివరాలను ఆయన అంతగా పట్టించుకోడు. అయినా ఆయనకు సైన్సు కథా పితామహుడు అన్న పేరుంది. Sci-Fic అనగానే మీకు వెల్స్ పేరు గుర్తు రాక మానదు. కాల యంత్రం పుట్టి శతాబ్దం చాటింది. అప్పటికీ ఇప్పటికీ దాని ఆకర్షణ శక్తి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అది పాఠకులకు అలరిస్తూనే ఉంది. వివాదాలను రేపుతూనే ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.