..మెకెంజీ ఆఫీసుకు ఫర్లాంగు దూరం ఉన్న బస్ స్టాప్ లో దిగి, వెదురుబొంగుకు చీర కట్టినట్టుగా ఉన్న ఒక సతీ, అడుగులో అడుగు వేసుకుంటూ, ఎక్కడ తూలిపడిపోతానోనని భయపడ్డట్టుగా, అతి నెమ్మదిగా, జాగ్రత్తగా నడుస్తూ మధ్యమధ్య స్తంభాలనూ, గోడలనూ పట్టుకుని మళ్ళీ నడక సాగించి ఆఫీసు చేరుకుంది. ఆమె కళ్ళు పీక్కుపోయి గమ్మత్తుగా, అసహ్యంగా ఉన్నాయి. జుట్టు దువ్వుకుంది కాని చాలా మట్టుకు ఊడిపోవటంతో విగ్గు పెట్టుకున్నట్టుగా ఉంది. సన్నగా పుల్లల్లాగైన చేతులూ ఇంతెందుకు ఆమె అభిమానులు చాలామంది పక్కనే స్కూటర్ల మీద వెళ్ళారు. ఆఫీసుకు టైమై పోయిందంటూ గబగబా నడుస్తూ వెళ్ళారు.
కాని ఆమెను గుర్తించనే లేదు. నడకలో, దూరం నుంచి చూస్తే ఇంకా కనిపించకుండా ఉన్న ఆమె అనాకారితనం దగ్గరగా నిలబడి మాట్లాడితే స్పష్టమైంది. జాలిగా, అడుక్కుంటున్నట్టుగా చూసే ఆ కళ్ళూ, చెక్కిళ్ళు పీక్కుపోగా, ఎముకలను అంటుకున్నట్టుగా ఉన్న మొహం, పెద్దగా తెరిచే ఆ నోరు ఒకప్పుడు వీనస్, ఆఫ్రోడైట్ కలిసి జన్మ ఎత్తినట్టుగా కనిపించిన మనోరమ ఆమె.
..మెకెంజీ ఆఫీసుకు ఫర్లాంగు దూరం ఉన్న బస్ స్టాప్ లో దిగి, వెదురుబొంగుకు చీర కట్టినట్టుగా ఉన్న ఒక సతీ, అడుగులో అడుగు వేసుకుంటూ, ఎక్కడ తూలిపడిపోతానోనని భయపడ్డట్టుగా, అతి నెమ్మదిగా, జాగ్రత్తగా నడుస్తూ మధ్యమధ్య స్తంభాలనూ, గోడలనూ పట్టుకుని మళ్ళీ నడక సాగించి ఆఫీసు చేరుకుంది. ఆమె కళ్ళు పీక్కుపోయి గమ్మత్తుగా, అసహ్యంగా ఉన్నాయి. జుట్టు దువ్వుకుంది కాని చాలా మట్టుకు ఊడిపోవటంతో విగ్గు పెట్టుకున్నట్టుగా ఉంది. సన్నగా పుల్లల్లాగైన చేతులూ ఇంతెందుకు ఆమె అభిమానులు చాలామంది పక్కనే స్కూటర్ల మీద వెళ్ళారు. ఆఫీసుకు టైమై పోయిందంటూ గబగబా నడుస్తూ వెళ్ళారు. కాని ఆమెను గుర్తించనే లేదు. నడకలో, దూరం నుంచి చూస్తే ఇంకా కనిపించకుండా ఉన్న ఆమె అనాకారితనం దగ్గరగా నిలబడి మాట్లాడితే స్పష్టమైంది. జాలిగా, అడుక్కుంటున్నట్టుగా చూసే ఆ కళ్ళూ, చెక్కిళ్ళు పీక్కుపోగా, ఎముకలను అంటుకున్నట్టుగా ఉన్న మొహం, పెద్దగా తెరిచే ఆ నోరు ఒకప్పుడు వీనస్, ఆఫ్రోడైట్ కలిసి జన్మ ఎత్తినట్టుగా కనిపించిన మనోరమ ఆమె.© 2017,www.logili.com All Rights Reserved.