భారతదేశ జనాభాలో 74 శాతం గ్రామీణులే. వారంతా వ్యవసాయం దాని అనుబంధ వ్యాపకాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో రైతులు అనబడుతున్న వ్యవసాయదారులు, కౌలురైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. అర ఎకరం, ముప్పావు ఎకరం మాత్రమే ఉన్న అత్యధిక రైతులు పెద్ద రైతుల భూములను కౌలుకు తీసుకుని కౌలు రైతులుగా వ్యవసాయం సాగిస్తున్నారు. అధిక భాగం కౌలు రైతులకు భూమిపై ఏ మాత్రం హక్కులేదు. వ్యవసాయరంగంలో కౌలు రైతుల పాత్రే అధికంగా ఉంది.
కౌలు రైతుల వెతలను కళ్ళకు కట్టినట్టుగా అతి సులభశైలిలో అందరికీ అర్థమయేటట్లు ఈ పుస్తకంలో వివరించారు శ్రీ తాళ్ళూరి లాబాన్ బాబు. కౌలు రైతుల సమస్యలు వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. నేటి ఆధునిక యువతకు అవగాహన కలిగించడానికి నేటి గ్రామీణ భారతం చారిత్రిక నేపథ్యం, కౌలు విధానం, తెలుగునాట రైతాంగ పోరాటాలు, తెలంగాణా సాయుధ రైతు పోరాటం, భూస్వాములు పెద్ద రైతులుగా, బడుగు రైతులు కౌలు రైతులుగా మారిన విధానాన్ని, ఎన్ని మారినా చిన్న కౌలు రైతులు, రైతు కూలీల పరిస్థితిలో మార్పురాని విషయాన్ని సవివరంగా చిత్రీకరించారు.
పాలేరు వ్యవస్థ రద్దు కావడంతో కౌలు రైతు దురవస్థను వివరించి పరిష్కార మార్గాలను సూచించారు. ఈనాటి వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణాలు, వాటి పరిష్కారానికి మార్గాలను సూచిస్తూ ప్రభుత్వం వాటిని ఆచరణలో పెట్టగలగాలి అని సూచించారు రచయిత. దుస్థితిలో ఉన్న వ్యవసాయరంగాన్ని, దుర్భరంగా కొనసాగుతున్న బడుగు రైతులు, కౌలు రైతులు సమస్యలను పరిష్కరించడానికి సరైన సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల సదస్సులో చేసిన సూచనలు సరిపోవని, వ్యవసాయ నిపుణులు, ఆర్ధికవేత్తలు, పరిశోధకులు చెబుతున్న కారణాలు, వాటి పరిష్కార మార్గాలను వివరించారు. ఈ పుస్తకంలో కొన్ని రెవెన్యూ పదాలు, తెలుగులో వాడుకలోకి వచ్చిన కొన్ని ఉర్దూ పదాలను కూడా క్రోడీకరించారు.
- వై వెంకటేశ్వర రావు
భారతదేశ జనాభాలో 74 శాతం గ్రామీణులే. వారంతా వ్యవసాయం దాని అనుబంధ వ్యాపకాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో రైతులు అనబడుతున్న వ్యవసాయదారులు, కౌలురైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. అర ఎకరం, ముప్పావు ఎకరం మాత్రమే ఉన్న అత్యధిక రైతులు పెద్ద రైతుల భూములను కౌలుకు తీసుకుని కౌలు రైతులుగా వ్యవసాయం సాగిస్తున్నారు. అధిక భాగం కౌలు రైతులకు భూమిపై ఏ మాత్రం హక్కులేదు. వ్యవసాయరంగంలో కౌలు రైతుల పాత్రే అధికంగా ఉంది. కౌలు రైతుల వెతలను కళ్ళకు కట్టినట్టుగా అతి సులభశైలిలో అందరికీ అర్థమయేటట్లు ఈ పుస్తకంలో వివరించారు శ్రీ తాళ్ళూరి లాబాన్ బాబు. కౌలు రైతుల సమస్యలు వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. నేటి ఆధునిక యువతకు అవగాహన కలిగించడానికి నేటి గ్రామీణ భారతం చారిత్రిక నేపథ్యం, కౌలు విధానం, తెలుగునాట రైతాంగ పోరాటాలు, తెలంగాణా సాయుధ రైతు పోరాటం, భూస్వాములు పెద్ద రైతులుగా, బడుగు రైతులు కౌలు రైతులుగా మారిన విధానాన్ని, ఎన్ని మారినా చిన్న కౌలు రైతులు, రైతు కూలీల పరిస్థితిలో మార్పురాని విషయాన్ని సవివరంగా చిత్రీకరించారు. పాలేరు వ్యవస్థ రద్దు కావడంతో కౌలు రైతు దురవస్థను వివరించి పరిష్కార మార్గాలను సూచించారు. ఈనాటి వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణాలు, వాటి పరిష్కారానికి మార్గాలను సూచిస్తూ ప్రభుత్వం వాటిని ఆచరణలో పెట్టగలగాలి అని సూచించారు రచయిత. దుస్థితిలో ఉన్న వ్యవసాయరంగాన్ని, దుర్భరంగా కొనసాగుతున్న బడుగు రైతులు, కౌలు రైతులు సమస్యలను పరిష్కరించడానికి సరైన సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల సదస్సులో చేసిన సూచనలు సరిపోవని, వ్యవసాయ నిపుణులు, ఆర్ధికవేత్తలు, పరిశోధకులు చెబుతున్న కారణాలు, వాటి పరిష్కార మార్గాలను వివరించారు. ఈ పుస్తకంలో కొన్ని రెవెన్యూ పదాలు, తెలుగులో వాడుకలోకి వచ్చిన కొన్ని ఉర్దూ పదాలను కూడా క్రోడీకరించారు. - వై వెంకటేశ్వర రావు© 2017,www.logili.com All Rights Reserved.