గత పదిహేను సంవత్సరాలలో 10 ముద్రణలు పొంది సంచలనం సృష్టించింది "మాదిగవారి చరిత్ర" మొదటి భాగం. ఈ విజయానికి కారణం పాఠక మహాశయులు. ముఖ్యంగా దండోరా ఉద్యమ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు. వీరందరికి శతకోటి నమస్కారాలు. ఈ పుస్తకం ద్వారా నేను ఆర్ధికంగా గడిచింది ఏమిలేదు. కానీ నేను హార్దికంగా గడిచింది మాత్రం చాలా ఎక్కువ.
అతిగా వెనుకబడిన వారిని జాతీయ జనజీవన స్రవంతితో సమానస్థాయిలో ఎదగడానికి, వారిని జాగృతిపరచడానికి చేసిన ఈ రచన ఒక ఉద్యమంలా సాగింది. అనేక రికార్డులు నెలకొల్పింది. మాదిగ మహాజన సభలలో ఒకే రోజు కొన్ని గంటలలోనే 350 - 500 కాపీలు కొని రికార్డులు నెలకొల్పారు. అతిగా వెనుకబడినవారు చైతన్యవంతులు కావడానికి వారందరూ ముందుకొస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం.
ఆత్మగౌరవాన్ని ఆత్మస్థయిర్యాన్ని నింపుకొని తాడితులు పీడితులు దేశ సంపదలో వాటాకోసం ఉద్యమించి విజయం సాధించెదరుగాక!