కౌతా మార్కండేయ శాస్త్రి 22-09-1946 న శ్రీమతి కౌతా శ్యామలాంబ, సుబ్బారావు దంపతులకు గుంటూరు నందు జన్మించిరి. హిందూ కళాశాల, గుంటూరులో గణితము, సైన్లలో పట్టభద్రులు అయ్యిరి. సంస్కృతము కళాశాలలోనూ మరియు ప్రత్యేకముగానూ చదివిరి. విశాఖపట్నంలో ఎం.ఎ. (గణితము) చదువుతూ 22-09-1970 న శ్రీమతి కొత్తపల్లి కనకదుర్గాంబ, రామపూర్ణచంద్రరావుల తృతీయ పుత్రిక శుభలక్ష్మిని వివాహము చేసికొనిరి. ఆధ్యాత్మిక ఉన్నతికై ఆసేతు హిమచల పర్యంతము విస్తృతముగా పత్నీసమేతంగా పర్యటించిరి. స్వప్నంలో దర్శనమిచ్చిన శ్రీశాయిబాబావారి దివ్యమైన సలహామీద శ్రీశ్రీ
యోగనందస్వామివారి క్రియాయోగ దీక్ష తీసికొనిరి. తీవ్రధ్యానము చేసి పది లక్షల కన్నా ఎక్కువ క్రియలు చేసి వారి ప్రీతిపాత్ర శిష్యులయ్యిం. ధ్యానములో దంపతులిద్దరికీ ఎన్నో మారులు సత్ గురువుల, సప్తర్షుల, దివ్యపురుషుల మరియు దైవదర్శనములు అయినవి. ఈ విషయము బాహాటంగా చర్చించుటకు ఇష్టపడరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగవిరమణ తదుపరి 09/10/2006 తమ స్వంతఖర్చుతో క్రియాయోగ ధ్యానమందిరమును నిర్మంచిరి. (D No. 76, Devinagar, RK Puram Gate, Secunderabad - 56). ఎంతో మందిని క్రియాయోగ సుశిక్షితులను చేసిరి. ఈ మందిరములో ధ్యానము చేసిన పెక్కుమంది భయంకరమైన రుగ్మతల నుండి విముక్తి పొందిరి ఆత్మసాక్షత్కారము. దివ్యదర్శనములు అయినవి. ఈ దంపతుల కుమార్తె శ్రీమతి వేమూరి శ్యామల, అల్లుడు మహేష్, మనుమరాలు ఋషి మరియు మనమడు రుద్ర అందరూ క్రియాయోగ దీక్షపరులే. శ్రీ శాస్త్రిగారు పెక్కు ఆధ్యాత్మిక గ్రంథములు ఆంగ్లం, హింది మరియు తెలుగు భాషల్లో మహావతార్ బాబాజీ దివ్యానుగ్రహముతో రచించిరి.
కౌతా మార్కండేయ శాస్త్రి 22-09-1946 న శ్రీమతి కౌతా శ్యామలాంబ, సుబ్బారావు దంపతులకు గుంటూరు నందు జన్మించిరి. హిందూ కళాశాల, గుంటూరులో గణితము, సైన్లలో పట్టభద్రులు అయ్యిరి. సంస్కృతము కళాశాలలోనూ మరియు ప్రత్యేకముగానూ చదివిరి. విశాఖపట్నంలో ఎం.ఎ. (గణితము) చదువుతూ 22-09-1970 న శ్రీమతి కొత్తపల్లి కనకదుర్గాంబ, రామపూర్ణచంద్రరావుల తృతీయ పుత్రిక శుభలక్ష్మిని వివాహము చేసికొనిరి. ఆధ్యాత్మిక ఉన్నతికై ఆసేతు హిమచల పర్యంతము విస్తృతముగా పత్నీసమేతంగా పర్యటించిరి. స్వప్నంలో దర్శనమిచ్చిన శ్రీశాయిబాబావారి దివ్యమైన సలహామీద శ్రీశ్రీ యోగనందస్వామివారి క్రియాయోగ దీక్ష తీసికొనిరి. తీవ్రధ్యానము చేసి పది లక్షల కన్నా ఎక్కువ క్రియలు చేసి వారి ప్రీతిపాత్ర శిష్యులయ్యిం. ధ్యానములో దంపతులిద్దరికీ ఎన్నో మారులు సత్ గురువుల, సప్తర్షుల, దివ్యపురుషుల మరియు దైవదర్శనములు అయినవి. ఈ విషయము బాహాటంగా చర్చించుటకు ఇష్టపడరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగవిరమణ తదుపరి 09/10/2006 తమ స్వంతఖర్చుతో క్రియాయోగ ధ్యానమందిరమును నిర్మంచిరి. (D No. 76, Devinagar, RK Puram Gate, Secunderabad - 56). ఎంతో మందిని క్రియాయోగ సుశిక్షితులను చేసిరి. ఈ మందిరములో ధ్యానము చేసిన పెక్కుమంది భయంకరమైన రుగ్మతల నుండి విముక్తి పొందిరి ఆత్మసాక్షత్కారము. దివ్యదర్శనములు అయినవి. ఈ దంపతుల కుమార్తె శ్రీమతి వేమూరి శ్యామల, అల్లుడు మహేష్, మనుమరాలు ఋషి మరియు మనమడు రుద్ర అందరూ క్రియాయోగ దీక్షపరులే. శ్రీ శాస్త్రిగారు పెక్కు ఆధ్యాత్మిక గ్రంథములు ఆంగ్లం, హింది మరియు తెలుగు భాషల్లో మహావతార్ బాబాజీ దివ్యానుగ్రహముతో రచించిరి.© 2017,www.logili.com All Rights Reserved.