నేటి అత్యధిక పెట్టుబడితో కూడిన ఆధునిక వ్యవసాయానికి ఎంతో "కృషి విజ్ఞానం" అవసరం. రైతుల ఆత్మహత్యలకు "కృషివిజ్ఞాన" లోపం ప్రధానమైనది కాకపోయినా, అదీ ఒక కారణమే. విత్తన శుద్ధితో, రైతులు, సస్యరక్షణ ఖర్చులతో ఎంతో ఆదాచేసుకునే వీలున్నా, ఇప్పటికీ అది అలవాటు కాకపోవడం కృషివిజ్ఞాన లోపమనే చెప్పవచ్చు. భూసార పరీక్షల ప్రాధాన్యత గురించి రైతులకింకా అవగాహన కాకపోవడం కూడా ఈ కారణం వల్లనే.
భూసార పరీక్ష చేయించుకున్నప్పుడు, ముఖ్యంగా రైతులకు, తమ తమ నేలల ఆమ్ల, క్షారస్థాయిలు తెలిసిపోతాయి. వెనువెంటనే వాటిని తగురసాయన పదార్థాలతో బాగు చేసుకుంటే, అది శాశ్వతంగా "మంచినేల"లు అయిపోతాయి. ఇలా బాగుచేసిన తటస్థనెలల్లో పంటలను ఇబ్బడి ముబ్బడిగా, ఇతర నేలలకు దీటుగా పండించవచ్చు. ఈ ముఖ్యమైన అంశాన్ని గురించి ఆమ్లనేలలు గల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులకు అలాగే, క్షారనేలలున్న ఇతర జిల్లాల రైతులకు తెలియకపోవడం కూడా "కృషివిజ్ఞాన" లోపమే.
చిన్న, సన్నకారు రైతులు మొదలుకొని భారీగా వ్యవసాయం చేసే రైతులందరికీ నేడెంతో "కృషివిజ్ఞానం" కావాలి. అప్పుడే వారు తమ వ్యవసాయంలో విజయం సాధించగలుగుతారు. విశ్వవిద్యాలయం వారి "వ్యవసాయ పంచాగ"పఠనం అలాగే, నేడు అనేకంగా విడుదల అవుతున్న వ్యవసాయ మాస పత్రికలను చదవడం రైతుల విధి. దృశ్య, శ్రవణ మాధ్యమాలైన రేడియో మరియు టి వి ఛానళ్ళు ప్రసారం చేసే వ్యవసాయ కార్యక్రమాలను విధిగా విని, దర్శించాలి. వ్యవసాయ విస్తరణ విభాగం వారు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అనేక రూపాల్లో అందించే 'కృషివిజ్ఞానాన్ని' ఆస్వాదించాలి. రైతు శిక్షణా కేంద్రాలను సరిగా వినియోగించుకుంటే, అవి రైతులకు పుష్కల వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందిస్తాయి.
రైతులకు మరింత వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే ఉద్దేశ్యంతో సులభ శైలిలో ఈ 'కృషివిజ్ఞానం' పుస్తకాన్ని అందజేస్తున్నాను. ఈ పుస్తకం వ్యవసాయ శిక్షణ గరిపే సంస్థలకు కూడా "ప్రశ్నావళి" రూపకల్పనకు తోడ్పడవచ్చు. ఇందలి ప్రతి అంశం కూడా రైతులకు సులభంగా గుర్తుంది పోయేవిధంగా వ్రాయబడింది. ఆచరణలో పెట్టడానికి కూడా ఈ అంశాలు మిక్కిలి ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. ఈ పుస్తకం మరీ చిన్న రైతు మొదలుకుని, మరీ పెద్ద రైతుకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి, తగు ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాను.
- పాలాది లక్ష్మినారాయణ
నేటి అత్యధిక పెట్టుబడితో కూడిన ఆధునిక వ్యవసాయానికి ఎంతో "కృషి విజ్ఞానం" అవసరం. రైతుల ఆత్మహత్యలకు "కృషివిజ్ఞాన" లోపం ప్రధానమైనది కాకపోయినా, అదీ ఒక కారణమే. విత్తన శుద్ధితో, రైతులు, సస్యరక్షణ ఖర్చులతో ఎంతో ఆదాచేసుకునే వీలున్నా, ఇప్పటికీ అది అలవాటు కాకపోవడం కృషివిజ్ఞాన లోపమనే చెప్పవచ్చు. భూసార పరీక్షల ప్రాధాన్యత గురించి రైతులకింకా అవగాహన కాకపోవడం కూడా ఈ కారణం వల్లనే. భూసార పరీక్ష చేయించుకున్నప్పుడు, ముఖ్యంగా రైతులకు, తమ తమ నేలల ఆమ్ల, క్షారస్థాయిలు తెలిసిపోతాయి. వెనువెంటనే వాటిని తగురసాయన పదార్థాలతో బాగు చేసుకుంటే, అది శాశ్వతంగా "మంచినేల"లు అయిపోతాయి. ఇలా బాగుచేసిన తటస్థనెలల్లో పంటలను ఇబ్బడి ముబ్బడిగా, ఇతర నేలలకు దీటుగా పండించవచ్చు. ఈ ముఖ్యమైన అంశాన్ని గురించి ఆమ్లనేలలు గల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులకు అలాగే, క్షారనేలలున్న ఇతర జిల్లాల రైతులకు తెలియకపోవడం కూడా "కృషివిజ్ఞాన" లోపమే. చిన్న, సన్నకారు రైతులు మొదలుకొని భారీగా వ్యవసాయం చేసే రైతులందరికీ నేడెంతో "కృషివిజ్ఞానం" కావాలి. అప్పుడే వారు తమ వ్యవసాయంలో విజయం సాధించగలుగుతారు. విశ్వవిద్యాలయం వారి "వ్యవసాయ పంచాగ"పఠనం అలాగే, నేడు అనేకంగా విడుదల అవుతున్న వ్యవసాయ మాస పత్రికలను చదవడం రైతుల విధి. దృశ్య, శ్రవణ మాధ్యమాలైన రేడియో మరియు టి వి ఛానళ్ళు ప్రసారం చేసే వ్యవసాయ కార్యక్రమాలను విధిగా విని, దర్శించాలి. వ్యవసాయ విస్తరణ విభాగం వారు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అనేక రూపాల్లో అందించే 'కృషివిజ్ఞానాన్ని' ఆస్వాదించాలి. రైతు శిక్షణా కేంద్రాలను సరిగా వినియోగించుకుంటే, అవి రైతులకు పుష్కల వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందిస్తాయి. రైతులకు మరింత వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే ఉద్దేశ్యంతో సులభ శైలిలో ఈ 'కృషివిజ్ఞానం' పుస్తకాన్ని అందజేస్తున్నాను. ఈ పుస్తకం వ్యవసాయ శిక్షణ గరిపే సంస్థలకు కూడా "ప్రశ్నావళి" రూపకల్పనకు తోడ్పడవచ్చు. ఇందలి ప్రతి అంశం కూడా రైతులకు సులభంగా గుర్తుంది పోయేవిధంగా వ్రాయబడింది. ఆచరణలో పెట్టడానికి కూడా ఈ అంశాలు మిక్కిలి ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. ఈ పుస్తకం మరీ చిన్న రైతు మొదలుకుని, మరీ పెద్ద రైతుకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి, తగు ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాను. - పాలాది లక్ష్మినారాయణ
© 2017,www.logili.com All Rights Reserved.