రెండు దశాబ్దాలకు పైగా భారాతీయ కేంద్ర రాజకీయాలను శాసించిన సంకీర్ణ తత్వాన్ని సవాలు చేసి సంపూర్ణ బలగంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మూడు పర్యాయాలు గుజరాత్ రాష్ట్రంలో బిజెపిని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకు వచ్చిన మోడీ చరిష్మా ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కైవసం చేసుకునేందుకు పూర్తిగా ఉపకరించిందనడంలో ఎట్టి సందేహం లేదు . క్రమం తప్పకుండా గుజరాత్ లో అధికారం చేపట్టిన మోడీ వద్ద "ఎదో" మంత్రదండం ఉండే ఉంటుందని భారత ప్రజలు విశ్వసించరు. మోడీ ఆకర్షణే బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఉపకరించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో ఏ పార్టీకి బద్దులైనప్పటికీ మోడీ దేశానికీ ఎదో చేస్తాడనే నమ్మకాన్ని వెల్లడిచేస్తూ కేంద్రంలో అధికారంలోకి తెచ్చేందుకు బిజెపి వైపుకు ప్రజలు మొగ్గుతు ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులకు ఓట్లు వేశారు.