ఆధునిక పాశ్చాత్య సాహిత్యం గద్యంలోని లోతులను, అంతుపట్టని కోణాలను గుర్తించడానికి వివిధ సూత్రాలను, పద్ధతులను ప్రతిపాదించుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో ఇతర భారతీయ భాషలలాగా, ఆధునిక తెలుగు సాహిత్యంలో కృషి కొంచెం తక్కువేనని చెప్పుకోవచ్చు. విషయాన్ని గురించి, శిల్పాన్ని గురించి, వివిధ రీతుల గురించి, రచయిత గురించి విమర్శనాత్మక రచనలు వచ్చాయి.
కాని ఒక వాచకాన్ని కూలంకషంగా విశదీకరించి, విమర్శనాత్మకంగా పరిశీలించిన వ్యాసాల సంఖ్య, విస్మృతి ఆధునిక తెలుగు సాహిత్యంలో తక్కువే. ఇందులో ప్రతిపాదించబడ్డ అంశాలూ, చలం గురించీ, మైదానం గురించీ లేవనెత్తిన కొత్త దృక్కోణాలూ, సంధించిన కొత్త ప్రశ్నలూ అందుకు మద్దతుగా చూపబడ్డ అంతర్గత సాక్ష్యాలూ ప్రతి పాఠకుణ్నీ ముఖ్యంగా నా బోటి చలం పాత పాఠకుల్ని ఉద్రేకిస్తాయి, రెచ్చగొడతాయి. ఆ ఉద్రేకం మళ్ళా వాచకం వైపే మానని పరుగులు పెట్టిస్తుంది. సాహిత్యం గురించి తప్ప తక్కిన వాటన్నిటి గురించీ మాట్లాడుకుంటున్న మన సాహిత్య క్షేత్రానికి ఈ వ్యాసాలు మేలుకొలుపునిస్తాయని నమ్ముతున్నాను.
ఆధునిక పాశ్చాత్య సాహిత్యం గద్యంలోని లోతులను, అంతుపట్టని కోణాలను గుర్తించడానికి వివిధ సూత్రాలను, పద్ధతులను ప్రతిపాదించుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో ఇతర భారతీయ భాషలలాగా, ఆధునిక తెలుగు సాహిత్యంలో కృషి కొంచెం తక్కువేనని చెప్పుకోవచ్చు. విషయాన్ని గురించి, శిల్పాన్ని గురించి, వివిధ రీతుల గురించి, రచయిత గురించి విమర్శనాత్మక రచనలు వచ్చాయి. కాని ఒక వాచకాన్ని కూలంకషంగా విశదీకరించి, విమర్శనాత్మకంగా పరిశీలించిన వ్యాసాల సంఖ్య, విస్మృతి ఆధునిక తెలుగు సాహిత్యంలో తక్కువే. ఇందులో ప్రతిపాదించబడ్డ అంశాలూ, చలం గురించీ, మైదానం గురించీ లేవనెత్తిన కొత్త దృక్కోణాలూ, సంధించిన కొత్త ప్రశ్నలూ అందుకు మద్దతుగా చూపబడ్డ అంతర్గత సాక్ష్యాలూ ప్రతి పాఠకుణ్నీ ముఖ్యంగా నా బోటి చలం పాత పాఠకుల్ని ఉద్రేకిస్తాయి, రెచ్చగొడతాయి. ఆ ఉద్రేకం మళ్ళా వాచకం వైపే మానని పరుగులు పెట్టిస్తుంది. సాహిత్యం గురించి తప్ప తక్కిన వాటన్నిటి గురించీ మాట్లాడుకుంటున్న మన సాహిత్య క్షేత్రానికి ఈ వ్యాసాలు మేలుకొలుపునిస్తాయని నమ్ముతున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.