మైదానం
“లేచిపోయినా” నంటే ఎవరన్నా నన్ను, నా కెంతో కష్టంగా వుంటుంది. ఇది వరకంతా యీ మనుషుల్లోంచి, నీతి వర్తనులలోంచి వెళ్ళిపోయి, ఎడారిలో జీవించడం వల్ల నేను చేసిన పని ఘోరత్వం, నీచత్వం బోధ పడలేదు. ఆ జీవితమంతా సుందరమైన దివ్యమైన స్వప్నంవలె, ఆ యెడారి పుణ్యభూమివలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళ హారతివలె తోచింది. ఇంటినే, బంధువుల్నే, భర్తనే మరిపించగల అనుభవం ఎంత ఉన్నతమో, అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్నీ, మీరానీ అనుభవించిన తరవాత, మన చుట్టూ బతికే ఈ ప్రజలందరూ పురుషులేనా, మనుష్యులేనా అనిపిస్తుంది నాకు. నేను బండి దిగేటప్పుడు వీళ్ళు చుట్టూ పోగై,
'లేచిపోయిందిట్రా!'
'చాలా బావుందిరా మనిషి' 'కావలసిందే శాస్త్రి ముండకి!'
అంటూ వుంటే అర్థమయింది నాకు లోక మార్గం. చివరికి నువ్వూ అన్నావు లేచిపోవడానికి నీ భర్త లోపమేమన్నా ఉందా?'.......................
మైదానం “లేచిపోయినా” నంటే ఎవరన్నా నన్ను, నా కెంతో కష్టంగా వుంటుంది. ఇది వరకంతా యీ మనుషుల్లోంచి, నీతి వర్తనులలోంచి వెళ్ళిపోయి, ఎడారిలో జీవించడం వల్ల నేను చేసిన పని ఘోరత్వం, నీచత్వం బోధ పడలేదు. ఆ జీవితమంతా సుందరమైన దివ్యమైన స్వప్నంవలె, ఆ యెడారి పుణ్యభూమివలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళ హారతివలె తోచింది. ఇంటినే, బంధువుల్నే, భర్తనే మరిపించగల అనుభవం ఎంత ఉన్నతమో, అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్నీ, మీరానీ అనుభవించిన తరవాత, మన చుట్టూ బతికే ఈ ప్రజలందరూ పురుషులేనా, మనుష్యులేనా అనిపిస్తుంది నాకు. నేను బండి దిగేటప్పుడు వీళ్ళు చుట్టూ పోగై, 'లేచిపోయిందిట్రా!' 'చాలా బావుందిరా మనిషి' 'కావలసిందే శాస్త్రి ముండకి!' అంటూ వుంటే అర్థమయింది నాకు లోక మార్గం. చివరికి నువ్వూ అన్నావు లేచిపోవడానికి నీ భర్త లోపమేమన్నా ఉందా?'.......................© 2017,www.logili.com All Rights Reserved.