భారతదేశ విముక్తి సంగ్రామంలో పాల్గొని, తర్వాత 1947 - 49 మధ్యకాలంలో ఆ భూభాగాన్ని ఏకత్రితం చేసిన రైతుబిడ్డ వల్లభ్ భాయ్ జీవిత చరిత్ర ఇది. ఆ కధనాన్ని ఇంత సమగ్రమైన రీతిలో ఇంతవరకు ఎవరూ రచించలేదు.
ఉత్తర ప్రత్యుత్తరాలు, డైరీలు, స్వయంగా సర్దార్ రాసిన లేఖలు, ఆయన కుమార్తె మణిబెన్ అద్భుతమైన డైరీలను సైతం సంప్రదించి రచించిన ఈ జీవితకధనం అధికారికమైంది, సన్నిహిత పరిశీలనతో సర్వసమగ్రమైనది. ఇంతకన్నా మెరుగైన రచన బహుశా సాధ్యపడదేమో.
గాంధీ మద్దతుతో నెహ్రు ఎందుకు ప్రధానమంత్రి అయ్యారు? పటేల్ ఎందువల్ల కాలేదు? వల్లభ్ భాయ్ ముస్లిములకు వ్యతిరేకా? మౌలానా ఆజాద్, నెహ్రు, సుభాష్ చంద్రబోస్ లతో, మహాత్మునితో తన సంబంధాలు ఏవిధంగా ఉండేవి? ఆయన సోషలిస్టులతో ఎందుకు ఘర్షణ పడ్డారు? సర్దార్ పటేల్ దేశాన్ని ఏవిధంగా ఐక్యం చేసారు? దేశ విభజనకు అంగీకరించింది ఎందుకోసం? అంతకు చాలాకాలం ముందు సిరిసంపదలతో కూడిన సుఖమయ జీవితాన్ని కాదని గాంధీతో కలసి ఉద్యమపధంలో ఎందుకు నడిచారు? కూలంకషమైన పరిశోధన, నిర్మొహమాటమైన కధనరీతి గల ఈ గ్రంధాన్ని చదువుతూ పోయినకొద్దీ వీటితోపాటు ఇంకా అనేకమైన ప్రశ్నలకు మనకు సమాధానాలు లభిస్తాయి.
రాజ్ మోహన్ గాంధీ (రచయిత గురించి)
1935లో జన్మించిన రాజ్ మోహన్ గాంధీ, హిమ్మత్ పత్రిక ప్రధాన సంపాదకునిగా (1964 - 81), ఇండియన్ ఎక్స్ ప్రెస్, మద్రాస్, రెసిడెంట్ ఎడిటర్ గా(1985 -1987)పనిచేశారు. సి. రాజగోపాలాచారి జీవితచరిత్ర రెండు సంపుటాలు, ఎయిట్ లైవ్స్, ఎ స్టడీ ఆఫ్ ద హిందూ ముస్లిం ఎన్ కౌంటర్ అన్నవి ఆయన ఇతర రచనలలో ఉన్నాయి. వీటిలో రెండవది ఆ తర్వాత అండర్ స్టాండింగ్ ద ముస్లిం మైండ్ అనే పేరుతో ప్రచురితమైంది.
భారతదేశ విముక్తి సంగ్రామంలో పాల్గొని, తర్వాత 1947 - 49 మధ్యకాలంలో ఆ భూభాగాన్ని ఏకత్రితం చేసిన రైతుబిడ్డ వల్లభ్ భాయ్ జీవిత చరిత్ర ఇది. ఆ కధనాన్ని ఇంత సమగ్రమైన రీతిలో ఇంతవరకు ఎవరూ రచించలేదు. ఉత్తర ప్రత్యుత్తరాలు, డైరీలు, స్వయంగా సర్దార్ రాసిన లేఖలు, ఆయన కుమార్తె మణిబెన్ అద్భుతమైన డైరీలను సైతం సంప్రదించి రచించిన ఈ జీవితకధనం అధికారికమైంది, సన్నిహిత పరిశీలనతో సర్వసమగ్రమైనది. ఇంతకన్నా మెరుగైన రచన బహుశా సాధ్యపడదేమో. గాంధీ మద్దతుతో నెహ్రు ఎందుకు ప్రధానమంత్రి అయ్యారు? పటేల్ ఎందువల్ల కాలేదు? వల్లభ్ భాయ్ ముస్లిములకు వ్యతిరేకా? మౌలానా ఆజాద్, నెహ్రు, సుభాష్ చంద్రబోస్ లతో, మహాత్మునితో తన సంబంధాలు ఏవిధంగా ఉండేవి? ఆయన సోషలిస్టులతో ఎందుకు ఘర్షణ పడ్డారు? సర్దార్ పటేల్ దేశాన్ని ఏవిధంగా ఐక్యం చేసారు? దేశ విభజనకు అంగీకరించింది ఎందుకోసం? అంతకు చాలాకాలం ముందు సిరిసంపదలతో కూడిన సుఖమయ జీవితాన్ని కాదని గాంధీతో కలసి ఉద్యమపధంలో ఎందుకు నడిచారు? కూలంకషమైన పరిశోధన, నిర్మొహమాటమైన కధనరీతి గల ఈ గ్రంధాన్ని చదువుతూ పోయినకొద్దీ వీటితోపాటు ఇంకా అనేకమైన ప్రశ్నలకు మనకు సమాధానాలు లభిస్తాయి. రాజ్ మోహన్ గాంధీ (రచయిత గురించి) 1935లో జన్మించిన రాజ్ మోహన్ గాంధీ, హిమ్మత్ పత్రిక ప్రధాన సంపాదకునిగా (1964 - 81), ఇండియన్ ఎక్స్ ప్రెస్, మద్రాస్, రెసిడెంట్ ఎడిటర్ గా(1985 -1987)పనిచేశారు. సి. రాజగోపాలాచారి జీవితచరిత్ర రెండు సంపుటాలు, ఎయిట్ లైవ్స్, ఎ స్టడీ ఆఫ్ ద హిందూ ముస్లిం ఎన్ కౌంటర్ అన్నవి ఆయన ఇతర రచనలలో ఉన్నాయి. వీటిలో రెండవది ఆ తర్వాత అండర్ స్టాండింగ్ ద ముస్లిం మైండ్ అనే పేరుతో ప్రచురితమైంది.
© 2017,www.logili.com All Rights Reserved.