పల్లె నేపథ్యమైన జీవనంలో వ్యవసాయమే వారసత్వమైన కుటుంబంలో అచ్చమైన వ్యవసాయదారుడి కూతురుగా జన్మించిన నేను పల్లె గురించి సమగ్ర రూపంలో వ్రాయాలనే ఆలోచన కలిగింది. ఒక కుగ్రామంలో పుట్టి, పల్లెతనాన్ని మనసారా ఆస్వాదించి, మట్టి వాసనలను పీలుస్తూ ప్రకృతి ఒడిలో పరవశించిన నేను రాను రాను పల్లెల్లో పలికేవాళ్ళు లేక సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, విద్యా, వైద్య, వర్షభావ కారణాలతో పొట్టచేత పట్టుకొని బస్తీల్లోకి ఆటో డ్రైవర్లుగా, అపార్ట్ మెంట్లలో వాచ్ మెన్లుగా, ఇంకా బజ్జీలు, పకోడీలు అమ్ముకునే దయనీయ పరిస్థితిని చూడలేక, చేసేదిలేక నాలాంటి ఎంతోమంది పల్లె బిడ్డలకు తెలంగాణ కన్నీరు తుడిచి, తిరిగి సస్యశ్యామలమైన, అమలమైన పల్లె ఒడికి చేర్పించాలని ఆశిస్తున్నాను.
మా నాన్నగారు వ్యవసాయదారుడు. ఆ రోజుల్లో మా నాన్నగారు చదువుకున్నా, ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కలిగి ఉన్నా, ఆయన ఆ పల్లెలోని జీవితంతోటే తృప్తి చెందారు. వేరే ఏదైనా వ్యాపారం చేయాలనో, ఇంకేదో చేసి డబ్బులు సంపాదించాలనో ఆలోచన వారికి ఉండకపోయేది. దానిక్కారణం, ఆయన ఆ జీవితానికి అంకితమైపోయారు. అందుకే నేను మా నాన్నగారికి ఈ నవలను అంకితం చేస్తున్నాను.
- వేముగంటి శుక్తిమతి
పల్లె నేపథ్యమైన జీవనంలో వ్యవసాయమే వారసత్వమైన కుటుంబంలో అచ్చమైన వ్యవసాయదారుడి కూతురుగా జన్మించిన నేను పల్లె గురించి సమగ్ర రూపంలో వ్రాయాలనే ఆలోచన కలిగింది. ఒక కుగ్రామంలో పుట్టి, పల్లెతనాన్ని మనసారా ఆస్వాదించి, మట్టి వాసనలను పీలుస్తూ ప్రకృతి ఒడిలో పరవశించిన నేను రాను రాను పల్లెల్లో పలికేవాళ్ళు లేక సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, విద్యా, వైద్య, వర్షభావ కారణాలతో పొట్టచేత పట్టుకొని బస్తీల్లోకి ఆటో డ్రైవర్లుగా, అపార్ట్ మెంట్లలో వాచ్ మెన్లుగా, ఇంకా బజ్జీలు, పకోడీలు అమ్ముకునే దయనీయ పరిస్థితిని చూడలేక, చేసేదిలేక నాలాంటి ఎంతోమంది పల్లె బిడ్డలకు తెలంగాణ కన్నీరు తుడిచి, తిరిగి సస్యశ్యామలమైన, అమలమైన పల్లె ఒడికి చేర్పించాలని ఆశిస్తున్నాను. మా నాన్నగారు వ్యవసాయదారుడు. ఆ రోజుల్లో మా నాన్నగారు చదువుకున్నా, ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కలిగి ఉన్నా, ఆయన ఆ పల్లెలోని జీవితంతోటే తృప్తి చెందారు. వేరే ఏదైనా వ్యాపారం చేయాలనో, ఇంకేదో చేసి డబ్బులు సంపాదించాలనో ఆలోచన వారికి ఉండకపోయేది. దానిక్కారణం, ఆయన ఆ జీవితానికి అంకితమైపోయారు. అందుకే నేను మా నాన్నగారికి ఈ నవలను అంకితం చేస్తున్నాను. - వేముగంటి శుక్తిమతి© 2017,www.logili.com All Rights Reserved.