'నేను సైతం' నవల ఒక సాహస యత్నం. ఉద్యమాల గురించి, విశేషించి తెలంగాణ ఉద్యమం గురించి రాసినప్పుడు అదొక చరిత్ర అవుతుంది. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోసం కొనసాగించిన పోరాటం డెబ్బయి సంవత్సరాల కథ. ఆంధ్రుల పాలనకు, ఆంద్ర పాలకుల అణచివేత, దోపిడీ, దమన నీతి విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు, విశేషించి ఉద్యోగులు, యువతీ యువకులు, వివిధ వర్గాల వారు నిరంతరంగా, శాంతియుతంగా డెబ్బయి సంవత్సరాలు కొనసాగించిన సుదీర్ఘ పోరాటంలో మహత్తరమయిన దశలు, దిశలు, ఉద్యమాలు, పరిణామాలు ఎన్నో ఎన్నెన్నో. ఇదంతా ఒక ఉజ్వల చరిత్ర. దీనిని ప్రామాణికంగా అక్షరబద్ధం చేయడం సులభం కాదు. తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్ర కల్పన కాదు. మన కళ్ళముందు, మనలో అనేకులం, నిజానికి మనమందరం క్రియాత్మక భాగస్వాములుగా సంభవించిన చరిత్ర.
- దేవులపల్లి ప్రభాకరరావు
'నేను సైతం' నవల ఒక సాహస యత్నం. ఉద్యమాల గురించి, విశేషించి తెలంగాణ ఉద్యమం గురించి రాసినప్పుడు అదొక చరిత్ర అవుతుంది. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోసం కొనసాగించిన పోరాటం డెబ్బయి సంవత్సరాల కథ. ఆంధ్రుల పాలనకు, ఆంద్ర పాలకుల అణచివేత, దోపిడీ, దమన నీతి విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు, విశేషించి ఉద్యోగులు, యువతీ యువకులు, వివిధ వర్గాల వారు నిరంతరంగా, శాంతియుతంగా డెబ్బయి సంవత్సరాలు కొనసాగించిన సుదీర్ఘ పోరాటంలో మహత్తరమయిన దశలు, దిశలు, ఉద్యమాలు, పరిణామాలు ఎన్నో ఎన్నెన్నో. ఇదంతా ఒక ఉజ్వల చరిత్ర. దీనిని ప్రామాణికంగా అక్షరబద్ధం చేయడం సులభం కాదు. తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్ర కల్పన కాదు. మన కళ్ళముందు, మనలో అనేకులం, నిజానికి మనమందరం క్రియాత్మక భాగస్వాములుగా సంభవించిన చరిత్ర. - దేవులపల్లి ప్రభాకరరావు© 2017,www.logili.com All Rights Reserved.