పురుగు ముట్టిన పూజ
15-5-1980 గురువారం
చంద్ర !
నిన్ను తలుసుకుంటే పి.ల్లగాలికి వణికే ఒరి మొక్క లెక్క మనసంతా ఒణుకుతుంది. నీ పేరు అలుకు మడి అంచున మెత్తని పసుపు కుంకుమ లెక్క రాద్దామన్నా చెయ్యీ ఒణుకుతుంది. నా రాతో కోడిగీత. సదువు ఇడిసిపెట్టి శాన కాలమైంది. ఉత్తరాలు రాసే అలవాటు అవుసరం లేని దాన్ని పడమలింట్ల సందూక నుండి పాత వస్తువలు తీసినట్టు అక్షరాలు ఒక్కొక్కటి యాదిజేసుకొని రాస్తున్న.
నువ్వు పట్నం బొయ్యి యాడాది దాటినట్టుంది నాకు. బాగున్నవా ? మీ అక్క, కోడు, అల్లుడు బాగున్నరు. రూపాయలు పంపినవంటగా! మంచి పని జేసినవు. నెలరోజలసంది కొండకెదురు చూసినట్టు, ఎండిన సేలు వాన కెదురుచూసినట్టు, లేగ దూడ ఆవు కోసం చూసినట్టు నేను నీ ఉత్తరం కోసం సూసిన. విశాఖ మాసంల పోయినవు. అధిక జ్యేష్ట ఒచ్చింది. ఇయ్యాల్లే నీ ఉత్తరమొచ్చింది. నెలసంధి కాలు గాలిన పల్లిలెక్క కోమటి పార్వతమ్మ దెగ్గరికి తిరుగుతుంటే ఆమె ఎక్కడ యాష్టవడ్తదోనని సింది. ఇంకేదోపనున్నట్టు నేను ఆమె తానికి పోయినా ముందుగల్లనే 'ఉత్తరం రాలేదు పిల్లా' అని చెప్పి నన్న సిగ్గు సీకట్ల ముంచేది. ఇయ్యాల ఉత్తరం చూసి పచ్చని పసిరిక మీద మంకురంతా కురిసి సల్లనిగాలి సోకినట్టు మనసంతా నిండింది.
నీకు ఊరన్నా, ఈ గాలి చేలు, జనమన్నా ఎంత పానం? సంటి పిల్లకు తల్లి మీదున్నంత పానమని నాకు తెలుసు. అందుకే ముందుగాల ఊరి సంగతులు రాస్త.
ఎండలు మండిపోతున్నాయి. 'భరణిల ఇత్తనాలేస్తే ధరణి పండుతుంద'ంటరు. భరణి కార్తిల నాల్గు సుక్కలన్నా చినుకులు రాలనేలేదు. ఇది కృతిక కార్తె. ఇంకా ఆశలు పడే ఆశ గనపడ్తలేదు. జువ్వున దుమ్ము. దూసరితం గలిపి సుడిగాల్లు ఈస్తున్నయి. సెలకల పొంటి అందరూ సెట్టూబొట్టా కొట్టుకున్నరు. కూలోల్లకు పనులు లేక అడివి పొంటి తునికాకు, యాప పలుకులు ఏరుకొస్తుండ్రు. ఆఖరుకు మిగిలిన కంచెగడ్డి కోతలు మన ఊరికి శానదూరం. అవ్వీ ఐపోవొచ్చినయి. ఇప్పుడొక్కవాన బొలబొల వస్తే బాగుండునని ఎదురు సూసుకుంట ఎకురం రొండెకురాల రైతులంత కందులు, పెసర్లు, సద్దలు, జొన్నలు ఇత్తనాల కోసం సగజేసి పెట్టుకున్నరు. ఇదీ...........
పురుగు ముట్టిన పూజ 15-5-1980 గురువారం చంద్ర ! నిన్ను తలుసుకుంటే పి.ల్లగాలికి వణికే ఒరి మొక్క లెక్క మనసంతా ఒణుకుతుంది. నీ పేరు అలుకు మడి అంచున మెత్తని పసుపు కుంకుమ లెక్క రాద్దామన్నా చెయ్యీ ఒణుకుతుంది. నా రాతో కోడిగీత. సదువు ఇడిసిపెట్టి శాన కాలమైంది. ఉత్తరాలు రాసే అలవాటు అవుసరం లేని దాన్ని పడమలింట్ల సందూక నుండి పాత వస్తువలు తీసినట్టు అక్షరాలు ఒక్కొక్కటి యాదిజేసుకొని రాస్తున్న. నువ్వు పట్నం బొయ్యి యాడాది దాటినట్టుంది నాకు. బాగున్నవా ? మీ అక్క, కోడు, అల్లుడు బాగున్నరు. రూపాయలు పంపినవంటగా! మంచి పని జేసినవు. నెలరోజలసంది కొండకెదురు చూసినట్టు, ఎండిన సేలు వాన కెదురుచూసినట్టు, లేగ దూడ ఆవు కోసం చూసినట్టు నేను నీ ఉత్తరం కోసం సూసిన. విశాఖ మాసంల పోయినవు. అధిక జ్యేష్ట ఒచ్చింది. ఇయ్యాల్లే నీ ఉత్తరమొచ్చింది. నెలసంధి కాలు గాలిన పల్లిలెక్క కోమటి పార్వతమ్మ దెగ్గరికి తిరుగుతుంటే ఆమె ఎక్కడ యాష్టవడ్తదోనని సింది. ఇంకేదోపనున్నట్టు నేను ఆమె తానికి పోయినా ముందుగల్లనే 'ఉత్తరం రాలేదు పిల్లా' అని చెప్పి నన్న సిగ్గు సీకట్ల ముంచేది. ఇయ్యాల ఉత్తరం చూసి పచ్చని పసిరిక మీద మంకురంతా కురిసి సల్లనిగాలి సోకినట్టు మనసంతా నిండింది. నీకు ఊరన్నా, ఈ గాలి చేలు, జనమన్నా ఎంత పానం? సంటి పిల్లకు తల్లి మీదున్నంత పానమని నాకు తెలుసు. అందుకే ముందుగాల ఊరి సంగతులు రాస్త. ఎండలు మండిపోతున్నాయి. 'భరణిల ఇత్తనాలేస్తే ధరణి పండుతుంద'ంటరు. భరణి కార్తిల నాల్గు సుక్కలన్నా చినుకులు రాలనేలేదు. ఇది కృతిక కార్తె. ఇంకా ఆశలు పడే ఆశ గనపడ్తలేదు. జువ్వున దుమ్ము. దూసరితం గలిపి సుడిగాల్లు ఈస్తున్నయి. సెలకల పొంటి అందరూ సెట్టూబొట్టా కొట్టుకున్నరు. కూలోల్లకు పనులు లేక అడివి పొంటి తునికాకు, యాప పలుకులు ఏరుకొస్తుండ్రు. ఆఖరుకు మిగిలిన కంచెగడ్డి కోతలు మన ఊరికి శానదూరం. అవ్వీ ఐపోవొచ్చినయి. ఇప్పుడొక్కవాన బొలబొల వస్తే బాగుండునని ఎదురు సూసుకుంట ఎకురం రొండెకురాల రైతులంత కందులు, పెసర్లు, సద్దలు, జొన్నలు ఇత్తనాల కోసం సగజేసి పెట్టుకున్నరు. ఇదీ...........© 2017,www.logili.com All Rights Reserved.