ఈ ఇలమీద ఒక మహాశక్తి సంపన్నుడున్నాడు. అతని చేతులు యంత్రాన్ని సులభంగా వేగవంతం చెయ్యగలవు. అతని పాదాలు ఒక్కరోజులో వేలాది మైళ్ళు చుట్టిపోగలవు. అతని రెక్కలతన్ని ఏ పక్షి ఎగరలేనంత ఎత్తులో మేఘాల పైగా విహరింపచేస్తాయి. అతని హస్తాలు ఏ చేప రెక్కలకంటే దృఢమైనవి. అగోచరమైనదాన్ని అతని కళ్ళు చూడగలవు.
ప్రపంచపు అవతలి అంచున మాట్లాడే మాటలని అతని చెవులు వినగలవు. అతనెంత శక్తివంతుడంటే పర్వతాలగుండా సొరంగ మార్గం చేసుకుపోగలడు, జలపాతాలని విశ్వామిత్రుడు త్రిశంకుని ఆపినట్టు ఆపగలడు. అతను భూమి ఆకారాన్ని మార్చేస్తున్నాడు, అడవులని నాటుతున్నాడు, సముద్రాలని కలుపుతున్నాడు, ఎడారి మరుభూముల్లోకి నీళ్ళను మల్లిస్తున్నాడు. ఎవరీ మహాశక్తి సంపన్నుడు? మానవుడు. కాని అతను మహాశక్తి సంపన్నుడెలా అయ్యాడు, ఈ ఇలకి అధినాధుడేలా అయ్యాడు? అదే ఈ పుస్తకంలోని కథ.
ఈ ఇలమీద ఒక మహాశక్తి సంపన్నుడున్నాడు. అతని చేతులు యంత్రాన్ని సులభంగా వేగవంతం చెయ్యగలవు. అతని పాదాలు ఒక్కరోజులో వేలాది మైళ్ళు చుట్టిపోగలవు. అతని రెక్కలతన్ని ఏ పక్షి ఎగరలేనంత ఎత్తులో మేఘాల పైగా విహరింపచేస్తాయి. అతని హస్తాలు ఏ చేప రెక్కలకంటే దృఢమైనవి. అగోచరమైనదాన్ని అతని కళ్ళు చూడగలవు. ప్రపంచపు అవతలి అంచున మాట్లాడే మాటలని అతని చెవులు వినగలవు. అతనెంత శక్తివంతుడంటే పర్వతాలగుండా సొరంగ మార్గం చేసుకుపోగలడు, జలపాతాలని విశ్వామిత్రుడు త్రిశంకుని ఆపినట్టు ఆపగలడు. అతను భూమి ఆకారాన్ని మార్చేస్తున్నాడు, అడవులని నాటుతున్నాడు, సముద్రాలని కలుపుతున్నాడు, ఎడారి మరుభూముల్లోకి నీళ్ళను మల్లిస్తున్నాడు. ఎవరీ మహాశక్తి సంపన్నుడు? మానవుడు. కాని అతను మహాశక్తి సంపన్నుడెలా అయ్యాడు, ఈ ఇలకి అధినాధుడేలా అయ్యాడు? అదే ఈ పుస్తకంలోని కథ.© 2017,www.logili.com All Rights Reserved.