చిరంజీవి ఓలేటి శ్రీనివాస భాను దీనిని అందరికీ అర్థమయ్యే తెలుగులో గేయపాదాలుగా రచించడం చదివేవారి అదృష్టం. 'ముకుందమాల' లోని శ్లోకాలు 40. మొదటిది కులశేఖరుని స్తుతి. చివరిది ఫలశ్రుతి. ఇవి రెండూ ప్రక్షిప్తాలని కొందరి విజ్ఞుల భావన. ప్రథమ పురుషలో ఉన్నవి కాబట్టి. కాని కేరళీయులు తమను మరోకరిగా సంభావించుకొనడం ఉంది. ముఖ్యంగా పాటల్లో 'రంగారావుకి కృష్ణుడంటే ఇష్టం' అని నేనే చెప్పుకొనటంలాగ. ఈ నలభై శ్లోకాలను ఇరవై మూడు గేయ పాదాలుగా విడమరిచారు రచయిత.
పెంచడం కాదు. ఒక శ్లోక భావాన్ని అవసరమైనప్పుడు రెండు గేయ పాదాలుగా నింపారు. ఇందులో కులశేఖరుని భావాలు నేను తెలిసి పెట్టలేదు. మనసుకి నచ్చడమే కాదు, మనసుపై గాఢముద్ర వేస్తే అవి తెలియకుండానే ఒకో సమయంలో బయటపడతాయి. ఈ చిరంజీవి ముందే ఎందరో ముకుందమాలను సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఇకముందూ అటువంటి సత్ప్రయత్నాలు జరుగుతాయి.
చిరంజీవి ఓలేటి శ్రీనివాస భాను దీనిని అందరికీ అర్థమయ్యే తెలుగులో గేయపాదాలుగా రచించడం చదివేవారి అదృష్టం. 'ముకుందమాల' లోని శ్లోకాలు 40. మొదటిది కులశేఖరుని స్తుతి. చివరిది ఫలశ్రుతి. ఇవి రెండూ ప్రక్షిప్తాలని కొందరి విజ్ఞుల భావన. ప్రథమ పురుషలో ఉన్నవి కాబట్టి. కాని కేరళీయులు తమను మరోకరిగా సంభావించుకొనడం ఉంది. ముఖ్యంగా పాటల్లో 'రంగారావుకి కృష్ణుడంటే ఇష్టం' అని నేనే చెప్పుకొనటంలాగ. ఈ నలభై శ్లోకాలను ఇరవై మూడు గేయ పాదాలుగా విడమరిచారు రచయిత. పెంచడం కాదు. ఒక శ్లోక భావాన్ని అవసరమైనప్పుడు రెండు గేయ పాదాలుగా నింపారు. ఇందులో కులశేఖరుని భావాలు నేను తెలిసి పెట్టలేదు. మనసుకి నచ్చడమే కాదు, మనసుపై గాఢముద్ర వేస్తే అవి తెలియకుండానే ఒకో సమయంలో బయటపడతాయి. ఈ చిరంజీవి ముందే ఎందరో ముకుందమాలను సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఇకముందూ అటువంటి సత్ప్రయత్నాలు జరుగుతాయి.© 2017,www.logili.com All Rights Reserved.