ఆరుగొలను మా ఊరు. మా ఊరంటే మాదే. ఆరుగొలను మా నండూరి వారి మొఖాసా. మొఖాసా అంటే నాకు బాగా తెలియదు గాని - మా పూర్వికులకి ఏ నవాబో రాజో జమీందారో ఇనాముగా ఇచ్చిన గ్రామం. మొదట్లో ఆరు గోలనులో అందరూ నండూరి వారే ఉండేవారు - రెండు మూడు కుటుంబాల వారు తప్ప. అంచేత ఊరిలో ఎటు వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా నండూరి వారే. తాతయ్యలు, బాబాయిలు, బామ్మలు, అత్తయ్యలు, అన్నయ్యలు, పిన్నులు - అందరూ నండూరి వారే. ఆరుగోలనులో ఆరు పెద్ద కొలనులు - చెరువులు ఉండేవిట. అందుకే ఆ పేరు. నాకు తెలిసి - మా యింటికేదురుగా ఉన్న పెద్ద చెరువు. పక్కనే చాకలి చెరువు. కొంచెం దూరంలో పొలాల్లో ఇంకో చెరువు ఉండేవి. చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లోనూ మా ఊరే పెద్ద ఊరు. మెయిన్ రోడ్డు మీద ఉన్న ఊరు. కృష్ణా జిల్లాలో గుడివాడ నుంచి నూజివీడు వెళ్ళే రూటులో గుదివాడకి తొమ్మిది మైళ్ళ దూరంలోనూ, అటు నుంచి హనుమాన్ జంక్షన్ కి అయిదు మైళ్ళ దూరంలో ఉంటుంది. చిరివాడ, లింగాల, పుట్టగుంట, తిప్పనగుంట, పెరికీడు, ఓగిరాల ఆరుగొలనుకు చుట్టూ ఉన్న పల్లెటుళ్ళు. తిప్పనగుంటనే మొవ్వారిగూడెం అనే వాళ్ళు. ఆ ఊరంతా మొవ్వవారే .
ముళ్ళపూడి శ్రీదేవి
ఆరుగొలను మా ఊరు. మా ఊరంటే మాదే. ఆరుగొలను మా నండూరి వారి మొఖాసా. మొఖాసా అంటే నాకు బాగా తెలియదు గాని - మా పూర్వికులకి ఏ నవాబో రాజో జమీందారో ఇనాముగా ఇచ్చిన గ్రామం. మొదట్లో ఆరు గోలనులో అందరూ నండూరి వారే ఉండేవారు - రెండు మూడు కుటుంబాల వారు తప్ప. అంచేత ఊరిలో ఎటు వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా నండూరి వారే. తాతయ్యలు, బాబాయిలు, బామ్మలు, అత్తయ్యలు, అన్నయ్యలు, పిన్నులు - అందరూ నండూరి వారే. ఆరుగోలనులో ఆరు పెద్ద కొలనులు - చెరువులు ఉండేవిట. అందుకే ఆ పేరు. నాకు తెలిసి - మా యింటికేదురుగా ఉన్న పెద్ద చెరువు. పక్కనే చాకలి చెరువు. కొంచెం దూరంలో పొలాల్లో ఇంకో చెరువు ఉండేవి. చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లోనూ మా ఊరే పెద్ద ఊరు. మెయిన్ రోడ్డు మీద ఉన్న ఊరు. కృష్ణా జిల్లాలో గుడివాడ నుంచి నూజివీడు వెళ్ళే రూటులో గుదివాడకి తొమ్మిది మైళ్ళ దూరంలోనూ, అటు నుంచి హనుమాన్ జంక్షన్ కి అయిదు మైళ్ళ దూరంలో ఉంటుంది. చిరివాడ, లింగాల, పుట్టగుంట, తిప్పనగుంట, పెరికీడు, ఓగిరాల ఆరుగొలనుకు చుట్టూ ఉన్న పల్లెటుళ్ళు. తిప్పనగుంటనే మొవ్వారిగూడెం అనే వాళ్ళు. ఆ ఊరంతా మొవ్వవారే . ముళ్ళపూడి శ్రీదేవి© 2017,www.logili.com All Rights Reserved.