ఆధునిక ప్రపంచం దురవస్థ (Predicarment) ఎలా ఉందో విజ్ఞుడైన ప్రతి ఒక్కడు గ్రహించ గలడు. ప్రపంచ జనాభా మొత్తం కూర్చొని తిన్నా తరగ నంత సంపద ఉంది. అయినా కొందరు ఆకలితో మాడిపోతూనే ఉన్నారు. చాల మందికి రెండు పూటల నిండు భోజనం లేదు.
మరో ప్రక్క భౌతిక సంపద, సుఖాలు, ఆధునిక సాంకేతిక విజ్ఞాన శాస్త్రాల పుణ్యమా అని, పుష్కలంగా ఉన్నాయి. బటన్ నొక్కితే చాలు అన్నీ సమ కూరుతున్నాయి. చావు కూడా. బటన్ నొక్కితే అణుబాంబు పేలి దేశాలకు దేశాలకు దేశాలే నాశనమయ్యే ప్రమాదముంది. ఒక ప్రక్క పుష్కల సంపద. దాని వెన్నంటే మృత్యుమృదంగ భీతి. ఈ రెండూ అంత్యాలు (Extremes). ఆ ఆంత్యాన్నో ఈ ఆంత్యాన్నో కౌగలించుకోకుండా మానవుడు మన జాలడా? మరో మార్గం లేదా? ఉంది - అదే బుద్ధుడు ప్రవచించిన మధ్యే మార్గం. "బుద్ధుడు మధ్యే మార్గాన్ని బోధించిన రోజుల్లో మీరు చెప్పిన పరిస్థితులు ఈనాడు లేవు కదా. మరి ఆ మధ్యే మార్గం ఇప్పుడెలా పనికి వస్తుంది?" - అని ఎవరైన ప్రశ్నించ వచ్చు. స్వభావరీత్యా చూస్తే నేటి ఆంత్యాలకు, నేటి ఆంత్యాలకు తేడా ఏమీ లేదు. కాక పొతే ఆయన చెప్పింది అతికామ సుఖాలలో మునిగి తేలవద్దు, అలాగని తపోనిష్ఠలతో శరీరాన్ని ఎండ గట్టుకో వద్దు అని.
- ఉపాసక అన్నపరెడ్డి