"నీలమత పురాణాన్ని" ఒక చారిత్రక పత్రంలా భావించి చదివి విశ్లేషిస్తే కశ్మీర్ గురించే కాదు , భారతదేశం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ కాలంలో దేశం నలుమూలల నుంచి పండితులు కశ్మీర్ చేరడం, కశ్మీర్ నుంచి ప్రజలు మిగతా దేశంలోని పలు తీర్థ ప్రదేశాలకు యాత్ర చేయడం వంటి విషయాలు తెలుస్తాయి. ఈనాడు , సంఖ్యాబలం చూపించి "కశ్మీర్ మాది" అని "మతం" ఆధారంగా "ప్రత్యేకత" ను కోరుతున్న పరిస్థితులలో , కశ్మీర్ భారతదేశంలో భౌగోళికంగానే కాదు, సాంప్రదాయికంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా, తాత్వికంగా ఒక అవిభాజ్యమైన అంగం అని భారతదేశ ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది.
కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు "నీలమత పురాణం" అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నాము .