గత పది రోజులుగా పత్రికలన్నిటిలోను భారత ఆర్ధిక వ్యవస్థకు సంబందించిన వార్తలు హోరెత్తిపోతున్నాయి . ప్రజా జీవనం మీద అతి ముఖ్యమైన ప్రభావం వెయ్యగల ఆర్ధిక వార్తలకు ఈ మధ్యకాలంలో ఇంత ప్రాధాన్యత ఎప్పుడు రాలేదు . ఆర్ధిక వార్తలు అలవాటు లేకపోవడం వల్ల , ఆర్ధిక శాస్త్ర పదజాలంతో తగినంత పరిచయం లేకపోవడం వల్ల ఈ ఆకస్మిక ఆర్ధిక వార్తల సంచలనం చాల మందిని అయోమయంలో పడేస్తున్నది . ఇంగ్లీష్ పత్రికల్లో వార్తలూ, వ్యాఖ్యలూ కూడా విరివిరిగా వచ్చి పాఠకులకు ఎంతో కొంత సొంత అభిప్రాయాలు ఏర్పరచుకునే అవకాశం ఇస్తున్నాయి గాని తెలుగు పత్రికల్లో మాత్రం అధికారిక సమాచారమూ , అనుకూల వ్యాఖ్యలూ తప్ప ఇతరాలు చాల తక్కువుగా వస్తున్నాయి.