ఈ బవిరి గడ్డపు హిట్లర్ను అడ్డుకుందాం!
ఏడు దశాబ్దాల కింద మట్టికరిచిన నరహంతకుడు అడాల్ఫ్ హిట్లర్ వికటాట్టహాసం ఇవాళ నరేంద్ర మోడీ రూపంలో భారత దేశమంతటా వినిపిస్తున్నది. ఇతర మతస్తుల పట్ల ద్వేషం, మతోన్మాదం, భిన్నాభిప్రాయాల పట్ల అసహనం, నిరంకుశత్వం, దేశభక్తి పేరిట సంపన్నుల సేవ, ప్రజలను మోసం చేసే సమ్మోహక వక్తృత్వశక్తి, ప్రజలకు అబద్ధపు కలలను అమ్మగల నేర్పు వంటి అనేక అంశాలలో హిట్లర్ కూ మోడీకీ దగ్గరి పోలికలున్నాయి. హిట్లర్ లాగనే మోడీ కూడ అవకాశం వస్తే తన అసహనాన్ని, విద్వేషాన్ని ఊచకోతలుగా మార్చగలనని 2002 గుజరాత్ మారణకాండలో చూపుకున్నాడు.
మొదటి ప్రపంచ యుద్ధ విరమణ ఒడంబడికలో జర్మనీకి అన్యాయం జరిగిందనీ, అందువల్లనే ఆర్థిక దుస్థితి వచ్చిందనీ నిజమైన కారణాలు చూపి హిట్లర్ ఎట్లాగైతే జాతీయోన్మాదాన్నీ, మూర్ఖత్వాన్నీ, హంతక ప్రవృత్తినీ రెచ్చగొట్టగలిగాడో, యువతను ఆకర్షించగలిగాడో, సరిగ్గా అలాగే మోడీకి కూడ కాంగ్రెస్ పాలన అవినీతి, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, అభివృద్ధి రాహిత్యం వంటి నిజమైన కారణాలున్నాయి. కాని హిట్లర్ అధికారానికి వచ్చిన తర్వాత ప్రపంచానికి ఎంత పెనుముప్పుగా మారాడో, ప్రపంచాన్ని ఎట్లా కబళించాడో, లక్షలాది మందిని ఎట్లా ఊచకోత కోశాడో, కోట్లాది మందిని యుద్ధంలో ఎట్లా బలితీసుకున్నాడో చరిత్ర చదివిన మనం మరి ఈ ఇరవై ఒకటో శతాబ్దపు హిట్లర్ను అధికారంలోకి రానిద్దామా అనేదే ఇవాళ ఈ దేశ ప్రజల ముందు, బుద్ధిజీవుల ముందు ఉన్న ప్రశ్న. ఇరవయో శతాబ్ది జర్మన్ సమాజం తెలిసి తెలిసీ అడాల్ఫ్ హిట్లర్ను అధికారానికి రానిచ్చి మహామానవ హననానికి కారణమైంది. ఇరవయో ఒకటో శతాబ్ది భారత సమాజం ఆ తప్పు చేయగూడదు.............
ఈ బవిరి గడ్డపు హిట్లర్ను అడ్డుకుందాం! ఏడు దశాబ్దాల కింద మట్టికరిచిన నరహంతకుడు అడాల్ఫ్ హిట్లర్ వికటాట్టహాసం ఇవాళ నరేంద్ర మోడీ రూపంలో భారత దేశమంతటా వినిపిస్తున్నది. ఇతర మతస్తుల పట్ల ద్వేషం, మతోన్మాదం, భిన్నాభిప్రాయాల పట్ల అసహనం, నిరంకుశత్వం, దేశభక్తి పేరిట సంపన్నుల సేవ, ప్రజలను మోసం చేసే సమ్మోహక వక్తృత్వశక్తి, ప్రజలకు అబద్ధపు కలలను అమ్మగల నేర్పు వంటి అనేక అంశాలలో హిట్లర్ కూ మోడీకీ దగ్గరి పోలికలున్నాయి. హిట్లర్ లాగనే మోడీ కూడ అవకాశం వస్తే తన అసహనాన్ని, విద్వేషాన్ని ఊచకోతలుగా మార్చగలనని 2002 గుజరాత్ మారణకాండలో చూపుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధ విరమణ ఒడంబడికలో జర్మనీకి అన్యాయం జరిగిందనీ, అందువల్లనే ఆర్థిక దుస్థితి వచ్చిందనీ నిజమైన కారణాలు చూపి హిట్లర్ ఎట్లాగైతే జాతీయోన్మాదాన్నీ, మూర్ఖత్వాన్నీ, హంతక ప్రవృత్తినీ రెచ్చగొట్టగలిగాడో, యువతను ఆకర్షించగలిగాడో, సరిగ్గా అలాగే మోడీకి కూడ కాంగ్రెస్ పాలన అవినీతి, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, అభివృద్ధి రాహిత్యం వంటి నిజమైన కారణాలున్నాయి. కాని హిట్లర్ అధికారానికి వచ్చిన తర్వాత ప్రపంచానికి ఎంత పెనుముప్పుగా మారాడో, ప్రపంచాన్ని ఎట్లా కబళించాడో, లక్షలాది మందిని ఎట్లా ఊచకోత కోశాడో, కోట్లాది మందిని యుద్ధంలో ఎట్లా బలితీసుకున్నాడో చరిత్ర చదివిన మనం మరి ఈ ఇరవై ఒకటో శతాబ్దపు హిట్లర్ను అధికారంలోకి రానిద్దామా అనేదే ఇవాళ ఈ దేశ ప్రజల ముందు, బుద్ధిజీవుల ముందు ఉన్న ప్రశ్న. ఇరవయో శతాబ్ది జర్మన్ సమాజం తెలిసి తెలిసీ అడాల్ఫ్ హిట్లర్ను అధికారానికి రానిచ్చి మహామానవ హననానికి కారణమైంది. ఇరవయో ఒకటో శతాబ్ది భారత సమాజం ఆ తప్పు చేయగూడదు.............© 2017,www.logili.com All Rights Reserved.