కల్పన కంటే సత్యమే సుందరంగా ఉంటుందని నిరూపించిన కథక చక్రవర్తి ప్రేమ్ చంద్. భూస్వామ్య వ్యవస్థ కూలిపోతూ పారిశ్రామిక నాగరికత తోసుకు వస్తున్న సమయంలో, పాత వ్యవస్థలోని కొంత మంచి కూడా ఎలా నశించిపోతుందో చిత్రించే నవల రంగభూమి. గుడ్డివాడు, బిచ్చగాడు ఐన సూరదాసు భూమిని మోసం ద్వారా జాన్ సేవక్ అనే పరిశ్రమికాధిపతి కొని, సిగరెట్ ఫ్యాక్టరీ స్థాపించడం, గ్రామ జీవితంలోని ప్రశాంతత ధ్వంసమై, కృత్రిమత్వం, కుటిలత్వం సూరదాసు తుపాకి గుండ్లకు బలై చనిపోతాడు.
గాంధీజీ సిద్ధాంతాలతో సంపూర్ణ విశ్వాసం గల ప్రేమ్ చంద్ జీవితాంతం త్యాగమయ జీవితం గడిపాడు. సోషలిస్టు ప్రపంచం గోర్కీ సాహిత్యంతో ఆకర్షితుడై, 1936లో ప్రథమ అభ్యుదయ రచయితల మహాసభకు అధ్యక్షత వహించి ఆ ఉద్యమానికి మూల పురుషుడైనాడు. ప్రేమ్ చంద్ ఉత్తమ రచనలలో ఒకటి రంగభూమి.
కల్పన కంటే సత్యమే సుందరంగా ఉంటుందని నిరూపించిన కథక చక్రవర్తి ప్రేమ్ చంద్. భూస్వామ్య వ్యవస్థ కూలిపోతూ పారిశ్రామిక నాగరికత తోసుకు వస్తున్న సమయంలో, పాత వ్యవస్థలోని కొంత మంచి కూడా ఎలా నశించిపోతుందో చిత్రించే నవల రంగభూమి. గుడ్డివాడు, బిచ్చగాడు ఐన సూరదాసు భూమిని మోసం ద్వారా జాన్ సేవక్ అనే పరిశ్రమికాధిపతి కొని, సిగరెట్ ఫ్యాక్టరీ స్థాపించడం, గ్రామ జీవితంలోని ప్రశాంతత ధ్వంసమై, కృత్రిమత్వం, కుటిలత్వం సూరదాసు తుపాకి గుండ్లకు బలై చనిపోతాడు. గాంధీజీ సిద్ధాంతాలతో సంపూర్ణ విశ్వాసం గల ప్రేమ్ చంద్ జీవితాంతం త్యాగమయ జీవితం గడిపాడు. సోషలిస్టు ప్రపంచం గోర్కీ సాహిత్యంతో ఆకర్షితుడై, 1936లో ప్రథమ అభ్యుదయ రచయితల మహాసభకు అధ్యక్షత వహించి ఆ ఉద్యమానికి మూల పురుషుడైనాడు. ప్రేమ్ చంద్ ఉత్తమ రచనలలో ఒకటి రంగభూమి.© 2017,www.logili.com All Rights Reserved.