రచయిత్రి పాత్రికేయురాలు రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యురు. ఉపాధ్యాయ వృత్తి వదిలేసి మక్కువతో జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టారు. ఈ పుష్కరకాలంలో విభిన్నమైన కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాన్ని స్టింగ్ కెమెరాతో దృశ్వికరించటం. 2008 ముంబాయి మరణహుమం లైవ్ కవరేజ్, ఐదు వేల మందికి పైగా మృత్యువాత పడిన 2013 ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్ వీటిలో కొన్ని. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత జమ్మూ - కాశ్మీర్ లో యుద్ధ వాతావరణ పరిస్థితులను సాహసోపేతంగా కవర్ చేశారామె. ఇవే కాకుండా పలు రాష్ట్రాల ఎన్నికల రిపోర్టింగ్ చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడి గుజరాత్ ముఖ్య మంత్రిగా ఎన్నికైనప్పుడు ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఆమె ఖాతాలో ఒక మాజీ ప్రధాని, వివిధ రాష్ట్రాలకు చెందిన 9 మంది ముఖ్య మంత్రుల ఇంటర్వ్యూలున్నాయి. విధి నిర్వహణలో భాగంగా దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన కొద్ది మంది తెలుగు జర్నలిస్టుల్లో ఆమె ఒకరు. మరో వైపు రచనా వ్యాసంగంలోనూ తనదైన ముద్రతో ముందుకు వెళుతున్నారు. ఆమె రాసిన కథలు, కవితలు, రాజకీయ వ్యాసాలు పలు దిన, వార, మాసపత్రికల్లో అచ్చయ్యాయి. భారత - పాకిస్థాన్, భారత బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఆమె ప్రయాణ అనుభవాల అక్షర రూపమే ఈ పుస్తకం.
- రెహానా