టర్కీకి వెళ్లే ముందు...
ఆ రోజు ఫిబ్రవరి 6, 2023. ఉదయం 8 గంటల సమయంలో అనుకుంటా టర్కీ భూకంప వార్తను న్యూస్ అలెర్ట్స్ లో చూశాను. టర్కీ స్థానిక సమయం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు రిక్టర్ స్కేల్ పై 7.8 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం వచ్చింది. ఇంత తీవ్రతతో భూకంపం అంటే ఆందోళనాకరమైన పరిస్థితి ఉండి ఉంటుంది అనుకున్నాను.
అంతర్జాతీయ మీడియాకి స్థానికంగా రిపోర్టర్స్ ఉంటారు కనుక సంఘటన జరిగిన వెంటనే సమాచారం వేగంగా వచ్చే అవకాశం ఉంటుంది. సీఎన్ఎన్, బీబీసీ చెక్ చేశాను. అప్పటికి మరణాల రిపోర్ట్స్ భారీగా లేవు. అయితే ఆ ఛానెల్స్ లో హృదయ విదారకర దృశ్యాలు వస్తున్నాయి. చీకట్లో, దారితెన్ను అర్థం కాని పరిస్థితుల్లో భయ విహ్వతులై బాధితులు రోడ్లపైకి వచ్చిన దృశ్యాలు, నేలమట్టం అయిన భవనాలు, శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చూశాను.
భూకంపం కొద్ది క్షణాల పాటే వచ్చి వెళుతుంది. కానీ అది కలిగించే కంపనాలు బాధితులను జీవిత కాలం వెంటాడుతూనే ఉంటాయి. కళ్ళు మూసి తెరిచేంతలో జీవితం చెల్లాచెదురు అయిపోతుందనే ఊహే భయకంపితంగా ఉంటుంది. టర్కీ ప్రజల పరిస్థితిని ఊహించుకుని నేను ఆవేదన చెందాను.
ఆ రెండో రోజు అంటే ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటలకు మా ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. 26 సెకన్ల పాటు మాట్లాడిన ఆ కాల్లో...............
టర్కీకి వెళ్లే ముందు... ఆ రోజు ఫిబ్రవరి 6, 2023. ఉదయం 8 గంటల సమయంలో అనుకుంటా టర్కీ భూకంప వార్తను న్యూస్ అలెర్ట్స్ లో చూశాను. టర్కీ స్థానిక సమయం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు రిక్టర్ స్కేల్ పై 7.8 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం వచ్చింది. ఇంత తీవ్రతతో భూకంపం అంటే ఆందోళనాకరమైన పరిస్థితి ఉండి ఉంటుంది అనుకున్నాను. అంతర్జాతీయ మీడియాకి స్థానికంగా రిపోర్టర్స్ ఉంటారు కనుక సంఘటన జరిగిన వెంటనే సమాచారం వేగంగా వచ్చే అవకాశం ఉంటుంది. సీఎన్ఎన్, బీబీసీ చెక్ చేశాను. అప్పటికి మరణాల రిపోర్ట్స్ భారీగా లేవు. అయితే ఆ ఛానెల్స్ లో హృదయ విదారకర దృశ్యాలు వస్తున్నాయి. చీకట్లో, దారితెన్ను అర్థం కాని పరిస్థితుల్లో భయ విహ్వతులై బాధితులు రోడ్లపైకి వచ్చిన దృశ్యాలు, నేలమట్టం అయిన భవనాలు, శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చూశాను. భూకంపం కొద్ది క్షణాల పాటే వచ్చి వెళుతుంది. కానీ అది కలిగించే కంపనాలు బాధితులను జీవిత కాలం వెంటాడుతూనే ఉంటాయి. కళ్ళు మూసి తెరిచేంతలో జీవితం చెల్లాచెదురు అయిపోతుందనే ఊహే భయకంపితంగా ఉంటుంది. టర్కీ ప్రజల పరిస్థితిని ఊహించుకుని నేను ఆవేదన చెందాను. ఆ రెండో రోజు అంటే ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటలకు మా ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. 26 సెకన్ల పాటు మాట్లాడిన ఆ కాల్లో...............© 2017,www.logili.com All Rights Reserved.