స్త్రీ
నది హ్యూమన్ రేస్ కి అరీజన్లు.
నది పుట్టుకను అన్వేషిస్తూ
అర్ధం చేసుకుంటూ-
కలకత్తా
వారణాసి
ప్రయాగ
గంగోత్రికి సాగొచ్చక,
పవిత్రం అశుద్ధమేలా అయిందో
అశుద్ధం పవిత్రమెలా అయి ఉందొ
ఎరుక కొచ్చింది .
సైమల్ తేనియస్ గా
స్త్రీ పుట్టుకను వెతుక్కుంటూ
నేడు దాటి
చరిత్ర దాటి
దాటి, దాని గతంలోకి వెళుతుంటే -
స్త్రీ వెతుకులాట
అమ్మ వెతుకులాటయిపోయింది
అమ్మ వెతుకులాటలో
నాకు నాతో పరిచయం జరిగాక
నన్ను నేను తెలుసుకున్నాను
అమ్మ అర్థమైంది
స్త్రీ అర్ధమైంది
చేతులెత్తి సమస్కరించాను ఆకాశానికి.