'రీసెర్చ్' అనే ఇంగ్లీషు మాట 'రిసెర్చ్' అని కూడా వ్యవహారంలో వుంది. మొదటిరకం వ్యవహారానికి పునః పరిశోధన పునరన్వేషణ అని అర్థం. ఇది ప్రాచీనాంగ్లంలో వ్యవ హారంలో ఉండేది. రెండోరకం వ్యవహారానికి జాగ్రత్తగా వెతకటం, లోతుగా అన్వేషించడం అని అర్థం. ఇది వర్తమానాంగ్లంలో వ్యవహరించబడుతున్నది. "నిర్దిష్టమైన విషయం గురించి కాని వ్యక్తి కోసంగాని దగ్గరగా, జాగ్రత్తగా) శోధించడం పరిశోధన,” “కొత్త సత్యాలను కనుగొనడానికి గాని, మరింత సమాచారాన్ని పొందడానికి గాని చేసే అన్వేషణే పరిశోధన" అని నిఘంటువులు చెబుతున్నాయి. ఈ రెండర్థాలూ కలిసి పరిశోధన అంటే ఏమిటో కొంతవరకు వివరించగలుగుతున్నాయి. ఏమీ తెలియని దానిని గురించి కొత్తగా చెప్పడం, ఇదివరకే కొంత తెలిసిన దానిని గురించి మరికొంత చెప్పడం, అలా చెప్పడానికి ఎన్నుకున్న అంశాన్ని లోతుగా పరిశీలించడం పరిశోధన అవుతుందని పైన పేర్కొన్న రెండర్థాలూ కలిసి స్పష్టం చేస్తున్నాయి. మన ప్రాచీన కావ్యాల్లోనూ, సంస్కృత గ్రంథాల్లోనూ శోధన, విశోధన అనే పదాలు వెతకడం, సరిచూసుకోవడం అనే అర్థాల్లో ప్రయోగింప బడినాయి. 3.
"నూతన సిద్ధాంతాన్ని నిర్మించేది లేక కళాసృష్టికి దోహదపడేది అయిన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, సరిదిద్దుకోడానికి, నిగ్గు తేల్చుకోడానికి, సాధారణీకరించడానికి, దొరికిన అంశాలను, భావనలను, సంకేతాలను వినియోగించుకోవడమే పరిశోధన" అని సామాజిక శాస్త్రాల విజ్ఞాన సర్వస్వం పేర్కొంది.. "జ్ఞానాన్వేషణకు, జ్ఞానాభివృద్ధికి, జ్ఞాన పరిశీలనకు చేసే ప్రయత్నం పరిశోధన.” ఇది "నిరంతరం సత్యాన్వేషణ చేస్తూ...............
సాహిత్య పరిశోధన 1.01. పరిశోధన - శబ్దచర్చ, నిర్వచనం : 'రీసెర్చ్' అనే ఇంగ్లీషు మాట 'రిసెర్చ్' అని కూడా వ్యవహారంలో వుంది. మొదటిరకం వ్యవహారానికి పునః పరిశోధన పునరన్వేషణ అని అర్థం. ఇది ప్రాచీనాంగ్లంలో వ్యవ హారంలో ఉండేది. రెండోరకం వ్యవహారానికి జాగ్రత్తగా వెతకటం, లోతుగా అన్వేషించడం అని అర్థం. ఇది వర్తమానాంగ్లంలో వ్యవహరించబడుతున్నది. "నిర్దిష్టమైన విషయం గురించి కాని వ్యక్తి కోసంగాని దగ్గరగా, జాగ్రత్తగా) శోధించడం పరిశోధన,” “కొత్త సత్యాలను కనుగొనడానికి గాని, మరింత సమాచారాన్ని పొందడానికి గాని చేసే అన్వేషణే పరిశోధన" అని నిఘంటువులు చెబుతున్నాయి. ఈ రెండర్థాలూ కలిసి పరిశోధన అంటే ఏమిటో కొంతవరకు వివరించగలుగుతున్నాయి. ఏమీ తెలియని దానిని గురించి కొత్తగా చెప్పడం, ఇదివరకే కొంత తెలిసిన దానిని గురించి మరికొంత చెప్పడం, అలా చెప్పడానికి ఎన్నుకున్న అంశాన్ని లోతుగా పరిశీలించడం పరిశోధన అవుతుందని పైన పేర్కొన్న రెండర్థాలూ కలిసి స్పష్టం చేస్తున్నాయి. మన ప్రాచీన కావ్యాల్లోనూ, సంస్కృత గ్రంథాల్లోనూ శోధన, విశోధన అనే పదాలు వెతకడం, సరిచూసుకోవడం అనే అర్థాల్లో ప్రయోగింప బడినాయి. 3. "నూతన సిద్ధాంతాన్ని నిర్మించేది లేక కళాసృష్టికి దోహదపడేది అయిన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, సరిదిద్దుకోడానికి, నిగ్గు తేల్చుకోడానికి, సాధారణీకరించడానికి, దొరికిన అంశాలను, భావనలను, సంకేతాలను వినియోగించుకోవడమే పరిశోధన" అని సామాజిక శాస్త్రాల విజ్ఞాన సర్వస్వం పేర్కొంది.. "జ్ఞానాన్వేషణకు, జ్ఞానాభివృద్ధికి, జ్ఞాన పరిశీలనకు చేసే ప్రయత్నం పరిశోధన.” ఇది "నిరంతరం సత్యాన్వేషణ చేస్తూ...............© 2017,www.logili.com All Rights Reserved.