స్వామి వివేకానంద సాహితి ప్రతిభను గొప్ప సాహిత్య విమర్శకులు, ప్రసిద్ధ రచయితలు ఎందరో విస్తృతస్థాయిలో గుర్తించారు. ప్రశంసించారు. చాలాకాలం పూర్వమే 1896 సెప్టెంబర్ లో లియొ టాల స్టాయ్ తన డైరీ లో ఇట్లా రాసుకున్నారు. తాను భారతీయతత్త్వజ్ఞానం గూర్చి సమ్మెహకమైన పుస్తకం చదివానని, అది తనకు ,మిత్రులెవరో పంపించారని. ఈ పుస్తకంలో పురభారతీయ తత్త్వశాస్త్రం గురించి వ్యాసపరంపర సంకలితమైంది. ఇవి న్యూయార్క్ లో స్వామి వివేకానంద 1895 - 96 శీతాకాలంలో ఇచ్చిన ఉపన్యాసపరంపర . 1931 లో రోమరోలా స్వామిజి లేఖలు, రచనలు, ప్రసంగాలు చదివి అత్యంత ప్రభావితుడై ఇట్లా రాశాడు . "అయన పలుకులు గొప్ప సంగీతం, పదబంధాలు బెధోవిన్ స్వరకల్పనలు, హాండెల్ బృందగానాలవలె ఆ శైలి ఉత్తేజపరుస్తుంది."