స్వీయ చరిత్ర ః ఆత్మకథ
రచయిత తన చరిత్రనే, వ్రాయునది స్వీయ చరిత్ర. తన వ్యక్తిగత జీవితాంశములనేగాక, తన సమకాలిక ప్రపంచ స్థితులను ఇతర వ్యక్తులను గూర్చి రచన యుండును. ఇదియు ఒక సాహిత్య ప్రక్రియయే. కేవలము ఆత్మస్థమై సాగు సాహిత్యలాహరి, లేక లహరుల పరంపర. తమ గత జీవితమును గూర్చి తన ఎరుకలో జరిగిన ఉదంతములను గూర్చి, ముఖ్య విషయముల ఏర్చి, కూర్చి, స్వల్పమైనవి, అనౌచిత్యమైనవి వదలి ఒక పథకము ప్రకారము నిర్ణయించుకొని వ్రాసిన రచన. ఈ వ్రాత ఆత్మాయత్తముగనే సాగుచుండును. రచన క్రమబద్ధమై, అందు తెలుపు సంఘటనలు పొంకముగ కుదించి, కుదుర్చియుండును.
రచన ఎవ్వరిని గూర్చి కేంద్రీకరింపబడి వ్రాయబడెనో, వారి అంతఃకరణ పరీక్ష జరిగి, బాహ్యమైన విషయములు, పరిచయమేర్పడిన వ్యక్తులు, వారి సంబంధముతో, తాను ఎట్లు మారినది, తానెట్లు ప్రభావితుడైనది, విపులముగ వర్ణింపబడును. ఇట్టి రచనలకు ఉదాహరణముగ, ఆంగ్ల సాహిత్యము నుండి కొన్ని మాత్రమే పేర్కొనబడినవి.
(1) ఫ్రెంచి వ్యాసరచన పితామహుడైన, మాంటెగు వ్రాసిన వ్యాసములు, షేక్స్పియర్ నాటక ప్రయోగముల గూర్చి తెలిసికొనుటకు సాధన సంపత్తిగా ఆకరమైన ముఖ్య గ్రంథమగు పెపీస్ డైరీ : కాలరిడ్జి వ్రాసిన బైయాగ్రఫియా లిటరియా : వర్డ్సువర్తు రచించిన ప్రియూడ్ : ఇవన్నియు స్వీయ చరిత్ర నిర్వచనము యొక్క విస్తృతములు. అతివ్యాప్తి రూపములు.
స్వీయ చరిత్ర వంటిదే, మెమోయిర్లు - జ్ఞాపక శకలములు. వీటిని స్వీయ చరిత్ర నుండి విడదీయుటకును వీలులేదు. వారి వారి కాలమున చరిత్రాత్మకముగా ప్రతిష్ఠ గణించి. యశస్సునార్జించి, దేశ చరిత్రతో సంబంధము కలుగజేసికొన్నవారు, వారి జ్ఞాపక శకలములను రచింతురు. ఇవికూడా 'స్వీయచరిత్ర' వర్గమునందే.....................
స్వీయ చరిత్ర ః ఆత్మకథ రచయిత తన చరిత్రనే, వ్రాయునది స్వీయ చరిత్ర. తన వ్యక్తిగత జీవితాంశములనేగాక, తన సమకాలిక ప్రపంచ స్థితులను ఇతర వ్యక్తులను గూర్చి రచన యుండును. ఇదియు ఒక సాహిత్య ప్రక్రియయే. కేవలము ఆత్మస్థమై సాగు సాహిత్యలాహరి, లేక లహరుల పరంపర. తమ గత జీవితమును గూర్చి తన ఎరుకలో జరిగిన ఉదంతములను గూర్చి, ముఖ్య విషయముల ఏర్చి, కూర్చి, స్వల్పమైనవి, అనౌచిత్యమైనవి వదలి ఒక పథకము ప్రకారము నిర్ణయించుకొని వ్రాసిన రచన. ఈ వ్రాత ఆత్మాయత్తముగనే సాగుచుండును. రచన క్రమబద్ధమై, అందు తెలుపు సంఘటనలు పొంకముగ కుదించి, కుదుర్చియుండును. రచన ఎవ్వరిని గూర్చి కేంద్రీకరింపబడి వ్రాయబడెనో, వారి అంతఃకరణ పరీక్ష జరిగి, బాహ్యమైన విషయములు, పరిచయమేర్పడిన వ్యక్తులు, వారి సంబంధముతో, తాను ఎట్లు మారినది, తానెట్లు ప్రభావితుడైనది, విపులముగ వర్ణింపబడును. ఇట్టి రచనలకు ఉదాహరణముగ, ఆంగ్ల సాహిత్యము నుండి కొన్ని మాత్రమే పేర్కొనబడినవి. (1) ఫ్రెంచి వ్యాసరచన పితామహుడైన, మాంటెగు వ్రాసిన వ్యాసములు, షేక్స్పియర్ నాటక ప్రయోగముల గూర్చి తెలిసికొనుటకు సాధన సంపత్తిగా ఆకరమైన ముఖ్య గ్రంథమగు పెపీస్ డైరీ : కాలరిడ్జి వ్రాసిన బైయాగ్రఫియా లిటరియా : వర్డ్సువర్తు రచించిన ప్రియూడ్ : ఇవన్నియు స్వీయ చరిత్ర నిర్వచనము యొక్క విస్తృతములు. అతివ్యాప్తి రూపములు. స్వీయ చరిత్ర వంటిదే, మెమోయిర్లు - జ్ఞాపక శకలములు. వీటిని స్వీయ చరిత్ర నుండి విడదీయుటకును వీలులేదు. వారి వారి కాలమున చరిత్రాత్మకముగా ప్రతిష్ఠ గణించి. యశస్సునార్జించి, దేశ చరిత్రతో సంబంధము కలుగజేసికొన్నవారు, వారి జ్ఞాపక శకలములను రచింతురు. ఇవికూడా 'స్వీయచరిత్ర' వర్గమునందే.....................© 2017,www.logili.com All Rights Reserved.