గత పది సంవత్సరాలుగా యువత విదేశాల వలసలు, తత్కారణంగా పెద్దల సమస్యలు విరివిగా కనిపిస్తున్న నేపధ్యంలో నేను ఈ రచనకు పూనుకున్నాను. చదివిన ఎందరో, ఇటువంటి ఆశ్రమాలు ఉన్నాయా అని ప్రశ్నించటం కూడా మొదలైంది. మనమే కలిసి ఒకటి ఎందుకు స్థాపించకూడదు అన్న సూచన ఇచ్చిన వారూ ఉన్నారు. వలస పోయిన కొడుకుల తల్లిదండ్రులు ఇప్పుడు కేవలం అరవై సంవత్సరాల దరిదాపులోనే ఉండి ఉంటారు. రోజులు గడుస్తున్నకొద్దీ, అంటే ఇంకో పది సంవత్సరాల తరువాత వృద్ధాప్యం వచ్చినప్పుడు అసలైన సమస్యలు ఉత్పన్నమౌతాయి. రానున్న సంవత్సరాలలో ఈ సమస్య పెరిగేదేకాని తరిగేది కాదు.
మన రాష్ట్ర రాజధాని శివార్లలో గత నాలుగు సంవత్సరాలలో ఇటువంటి ‘రిటైర్డ్ హోమ్స్’ అన్న పేరుతో ఆశ్రమాలే అనుకోండి, ఓల్డ్ ఏజ్ కేర్ సెంటర్స్ అనుకోండి, దాదాపు 200గేటెడ్ కమ్యూనిటీస్ వెలిశాయని తెలిసింది. ఇవి వృద్ధాశ్రమాల వలె దీనులకు కాదు. ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎవరి తాహతు బట్టి వారు హోమ్స్ ఎన్నుకోవచ్చు. ఈ విధంగా రిటైర్డ్ హోమ్స్ లో ఉండటం ఏ మాత్రమూ చిన్నతనం, అవమానకరంగా భావించనవసరం లేదు. ఎవరి ఇస్టానుసారం వారు జీవనం కొనసాగించటమే అందరూ కోరుకునేది. తరాల అంతరాలలో నలిగిపోవలసిన అవసరం లేదు. ఈ విషయం పెద్దలూ, వారి సంతానం కూడా అర్థం చేసుకుంటున్నారు. ఆనందంగా జీవిస్తున్నారు. ఎవరి తాహతుకు తగ్గట్టు వారు ఈ అవకాశాలు వినియోగించుకోండి. చివరి రోజులు మానసికంగా ఆనందంగా ఆరోగ్యంగా గడపండి. మీమీ స్వర్ణ కుటీరాలలో నివసించండి. జీవితాలు స్వర్ణమయం చేసుకోండి.
గత పది సంవత్సరాలుగా యువత విదేశాల వలసలు, తత్కారణంగా పెద్దల సమస్యలు విరివిగా కనిపిస్తున్న నేపధ్యంలో నేను ఈ రచనకు పూనుకున్నాను. చదివిన ఎందరో, ఇటువంటి ఆశ్రమాలు ఉన్నాయా అని ప్రశ్నించటం కూడా మొదలైంది. మనమే కలిసి ఒకటి ఎందుకు స్థాపించకూడదు అన్న సూచన ఇచ్చిన వారూ ఉన్నారు. వలస పోయిన కొడుకుల తల్లిదండ్రులు ఇప్పుడు కేవలం అరవై సంవత్సరాల దరిదాపులోనే ఉండి ఉంటారు. రోజులు గడుస్తున్నకొద్దీ, అంటే ఇంకో పది సంవత్సరాల తరువాత వృద్ధాప్యం వచ్చినప్పుడు అసలైన సమస్యలు ఉత్పన్నమౌతాయి. రానున్న సంవత్సరాలలో ఈ సమస్య పెరిగేదేకాని తరిగేది కాదు. మన రాష్ట్ర రాజధాని శివార్లలో గత నాలుగు సంవత్సరాలలో ఇటువంటి ‘రిటైర్డ్ హోమ్స్’ అన్న పేరుతో ఆశ్రమాలే అనుకోండి, ఓల్డ్ ఏజ్ కేర్ సెంటర్స్ అనుకోండి, దాదాపు 200గేటెడ్ కమ్యూనిటీస్ వెలిశాయని తెలిసింది. ఇవి వృద్ధాశ్రమాల వలె దీనులకు కాదు. ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎవరి తాహతు బట్టి వారు హోమ్స్ ఎన్నుకోవచ్చు. ఈ విధంగా రిటైర్డ్ హోమ్స్ లో ఉండటం ఏ మాత్రమూ చిన్నతనం, అవమానకరంగా భావించనవసరం లేదు. ఎవరి ఇస్టానుసారం వారు జీవనం కొనసాగించటమే అందరూ కోరుకునేది. తరాల అంతరాలలో నలిగిపోవలసిన అవసరం లేదు. ఈ విషయం పెద్దలూ, వారి సంతానం కూడా అర్థం చేసుకుంటున్నారు. ఆనందంగా జీవిస్తున్నారు. ఎవరి తాహతుకు తగ్గట్టు వారు ఈ అవకాశాలు వినియోగించుకోండి. చివరి రోజులు మానసికంగా ఆనందంగా ఆరోగ్యంగా గడపండి. మీమీ స్వర్ణ కుటీరాలలో నివసించండి. జీవితాలు స్వర్ణమయం చేసుకోండి.
© 2017,www.logili.com All Rights Reserved.