దైవం ఉనికిని నమ్మని వారు నాస్తికులు. దేవుడు సర్వంతర్యామిగా గాని, ఏ రూపంలోగాని లేరన్నది వారి వాదన. యుగయుగాలుగా మానవ శక్తులకు అతీతమైన శక్తి ఉందని నమ్మేనాటికే అటువంటి శక్తి లేదని నమ్మేవారూ ఉన్నారు. కర్యాకారణాలు తెలియడం వలన జ్ఞానం పెరుగుతుంది. అపోహాలు, భయాలు తొలగిపోతాయి. కొత్త జ్ఞానం, కొత్త భయాలనూ కల్పించవచ్చు. మరింత జ్ఞానంతో ఈ కొత్త భయాలూ తొలగవచ్చు. తెలుసుకోవలసిన విషయాలు ఉన్నన్ని రోజులూ అందుకు సంబంధించిన భయాలూ, ఆందోళనలూ ఉంటాయి.
ఆ భయాలను అధిగమించేందుకు 'దైవం' ఆసరా మానవులు తీసుకుంటారు. నాస్తికులు జ్ఞానాన్వేషణ ఆసరా తీసుకోమంటున్నారు. అందుకై గోరా నాస్తిక కేంద్రాన్ని స్థాపించి తన జీవితకాలం శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు ఎంతో కృషిచేశారు. ఈనాడు ఒకవైపు శాస్త్రీయ జ్ఞానం పెరుగుతున్నా ఆ జ్ఞానాన్ని నిజజీవితంలో అన్వయించుకోక పోవడం సర్వసాధారణంగా మారింది. ఉదాహరణకి సూర్యుడే ఒకనాడు శక్తికి మూలం. నీటి నుండి, గాలి నుండి, అణువుల నుండి, వ్యర్థాల నుండి, రకరకాల ఇతర పద్ధతులలో శక్తిని వెలికితీసి ఉపయోగించుకుంటున్నా ఈనాటికీ 'శక్తి' ప్రాధాన్యతలో సూర్యునిదే ప్రథమ స్థానం. శక్తనిచ్చే ఇతర పదార్థాలను కొలవం! సూర్యుడినే కొలుస్తాం! ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలనీ, శాస్త్రీయ దృక్పథాన్ని అలవారచుకోవాలనీ అభిలషిస్తూ నాస్తిక కేంద్రం ఇదివరకే ప్రచురించన ఈ పుస్తకాలను తిరిగి ప్రచురిస్తున్నాం. పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
- ప్రజాశక్తి ప్రింటర్స్
దైవం ఉనికిని నమ్మని వారు నాస్తికులు. దేవుడు సర్వంతర్యామిగా గాని, ఏ రూపంలోగాని లేరన్నది వారి వాదన. యుగయుగాలుగా మానవ శక్తులకు అతీతమైన శక్తి ఉందని నమ్మేనాటికే అటువంటి శక్తి లేదని నమ్మేవారూ ఉన్నారు. కర్యాకారణాలు తెలియడం వలన జ్ఞానం పెరుగుతుంది. అపోహాలు, భయాలు తొలగిపోతాయి. కొత్త జ్ఞానం, కొత్త భయాలనూ కల్పించవచ్చు. మరింత జ్ఞానంతో ఈ కొత్త భయాలూ తొలగవచ్చు. తెలుసుకోవలసిన విషయాలు ఉన్నన్ని రోజులూ అందుకు సంబంధించిన భయాలూ, ఆందోళనలూ ఉంటాయి. ఆ భయాలను అధిగమించేందుకు 'దైవం' ఆసరా మానవులు తీసుకుంటారు. నాస్తికులు జ్ఞానాన్వేషణ ఆసరా తీసుకోమంటున్నారు. అందుకై గోరా నాస్తిక కేంద్రాన్ని స్థాపించి తన జీవితకాలం శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు ఎంతో కృషిచేశారు. ఈనాడు ఒకవైపు శాస్త్రీయ జ్ఞానం పెరుగుతున్నా ఆ జ్ఞానాన్ని నిజజీవితంలో అన్వయించుకోక పోవడం సర్వసాధారణంగా మారింది. ఉదాహరణకి సూర్యుడే ఒకనాడు శక్తికి మూలం. నీటి నుండి, గాలి నుండి, అణువుల నుండి, వ్యర్థాల నుండి, రకరకాల ఇతర పద్ధతులలో శక్తిని వెలికితీసి ఉపయోగించుకుంటున్నా ఈనాటికీ 'శక్తి' ప్రాధాన్యతలో సూర్యునిదే ప్రథమ స్థానం. శక్తనిచ్చే ఇతర పదార్థాలను కొలవం! సూర్యుడినే కొలుస్తాం! ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలనీ, శాస్త్రీయ దృక్పథాన్ని అలవారచుకోవాలనీ అభిలషిస్తూ నాస్తిక కేంద్రం ఇదివరకే ప్రచురించన ఈ పుస్తకాలను తిరిగి ప్రచురిస్తున్నాం. పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. - ప్రజాశక్తి ప్రింటర్స్© 2017,www.logili.com All Rights Reserved.