తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారిలో ప్రసిద్ధులు గుర్రం జాషువా. సామాన్యుల నాల్కల పై కూడా నర్తించే పద్యాలు రాశారు జాషువా. అప్పటివరకూ సాహిత్యంలోకి రాని సరళమైన, జనసామాన్యం వాడే అనేక తెలుసు పదాలు జాషువా పద్యాలలో చూస్తాం. అగ్రకుల పండితులకే పరిమితమైన పద్య నిర్మాణ విద్యపై పట్టు సాధించిన జాషువా తెలుగు పాఠకలోకానికి కొత్తలోకాన్ని చూపించారు. ప్రకృతి వర్ణనలతో, సౌందర్యాల ప్రస్తావనలతో నిండిపోయిన పద్య ప్రపంచాన్ని సామాన్యుల కాళ్ళ దగ్గరకు లాక్కొచ్చారు జాషువా. తను ఎదుర్కొన్న సామాజిక జీవితంలోని అనేక అంశాలను వస్తువులుగా చేసుకొని అద్భుతమైన పద్యాలు సృష్టించారు. అటువంటి పద్యాలలో కొన్నిటిని విశ్లేషిస్తూ సాగిన రచనే ఈ 'జాషువా కలం చెప్పిన కథ'.
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారిలో ప్రసిద్ధులు గుర్రం జాషువా. సామాన్యుల నాల్కల పై కూడా నర్తించే పద్యాలు రాశారు జాషువా. అప్పటివరకూ సాహిత్యంలోకి రాని సరళమైన, జనసామాన్యం వాడే అనేక తెలుసు పదాలు జాషువా పద్యాలలో చూస్తాం. అగ్రకుల పండితులకే పరిమితమైన పద్య నిర్మాణ విద్యపై పట్టు సాధించిన జాషువా తెలుగు పాఠకలోకానికి కొత్తలోకాన్ని చూపించారు. ప్రకృతి వర్ణనలతో, సౌందర్యాల ప్రస్తావనలతో నిండిపోయిన పద్య ప్రపంచాన్ని సామాన్యుల కాళ్ళ దగ్గరకు లాక్కొచ్చారు జాషువా. తను ఎదుర్కొన్న సామాజిక జీవితంలోని అనేక అంశాలను వస్తువులుగా చేసుకొని అద్భుతమైన పద్యాలు సృష్టించారు. అటువంటి పద్యాలలో కొన్నిటిని విశ్లేషిస్తూ సాగిన రచనే ఈ 'జాషువా కలం చెప్పిన కథ'.© 2017,www.logili.com All Rights Reserved.