భారీ బడ్జెట్లు, వంద కోట్ల క్లబ్బుల్లో చేరడం గొప్ప కాదు, హృదయాన్ని చెమరింపజేసే లక్షణం ఉన్న సినిమా విలువైనది , విశిష్టమైనది . మన అంతరంగాలని కుదిపి కలవరానికి లోను చేసే గుణమేదో ఉన్నదే మంచి సినిమా అనే అవగహానని అందిస్తాయి వంశి కృష్ణ వ్యాసాలు. మానవ సంబంధాల్లోని వైరుధ్యాలను, ప్రేమలోని సున్నితమైన, సంక్లిష్టమైన పార్శ్వాలను సినిమాలు ఏ మేరకు పట్టుకున్నాయో, ఏవిధంగా ప్రతిఫలించాయో వంశి సినిమా వ్యాసాలు చెబుతాయి. ఆస్కార్ అవార్డు పొందిన "స్టీల్ ఎలైన్ " గురించి వంశి వ్యాసం చదివితే ఆ సినిమా చూసేందుకు ఆత్రపడతాం. ఒక కళరూపంగా సినిమా ప్రతిష్టని ఇనుమడింపజేసిన సత్యజితేరే బాలచందర్ , బాపు రమణ, జహ్నుబరువా , ముబారక్ బేగం, శశికపూర్ , ఎం.ఎస్. విశ్వనాథ్, సినారే మొదలైన ప్రముఖుల గురించి రాసిన వ్యాసాలు కొత్త కోణాలను దర్శింపజేస్తాయి.ఒక్కమాటలో చెప్పాలంటే మంచి సినిమాలను చూసే, మంచి సంగీతాన్ని వినే ఉత్తమాభిరుచుల్ని ప్రోది చేస్తాయి వంశి వ్యాసాలు.