ఓ పుస్తకం పూర్తి చేసే సమయంలోనే ఆ తరువాత దేని మీద చేద్దామా అని ఆలోచిస్తుంటారు. అలా ఆలోచనలోనే ఎక్కువ సమయం గడిచిపోతుంటుంది. దానికి కారణంతో అంటే ఇంతకు ముందు ఎవరు రాసి ఉండకూడదు. అలాంటి సబ్జెక్ట్ వెతకటం నాకు ఎప్పుడూ కత్తి మీద సాము. స్వచ్చమైన నీరుని మనం హిమాలయాల్లోనే చూడగలం. స్వచ్చమైన గాలిని ఉదయం పూట ఆశ్వాదించగలం. ఆ సమయంలో... చల్లటిగాలి... ఖచ్చితంగా ప్రకృతిలో ఫ్యామిలీతో షికార్ వచ్చినట్లు అనిపించింది. ఆరు తరువాత లేచే వారు బైటికిరానివారు ఎంత కోల్పోతున్నారో అర్థం అయ్యింది.
రెండు రోజులు పట్టే నా పనుల్ని ఒక్కరోజులోనే చకచకా పూర్తి చేశాను. ఇదే విషయాన్ని నాకు తెలిసిన డాక్టర్ కి చెప్పాను. ఆయన నవ్వి 'నువ్వు ఇంకా వాకింగ్ ని సరయిన పద్ధతిలో చెయ్యలేదు. అలా చేస్తే ఇంకా మంచి ఫలితాన్ని పొందగలవని' చెప్పారు. అనుభూతిని, పనిలో వేగానిని ఇచ్చిన వాకింగ్ ని పర్ ఫెక్ట్ గా ఎందుకు రాయకూడదు, ఆ తరువాత నాలుగు నెలలు కేవలం ఇదే సబ్జెక్ట్ మీద పనిచేశాను. ఇప్పటికి పూర్తి అయ్యింది. ఒక్కటే నేను చెప్పేది. వాక్ చేయండి, సరైన పద్ధతిలో... సరైన సమయంలో... రెగ్యులర్ గా... అప్పుడు మీరు ఏ హాస్పిటల్ గుమ్మం ఎక్కాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఉన్నా ఖచ్చితంగా అది మీకోసం కాదు...
- మైథిలీ వెంకటేశ్వరరావు
ఓ పుస్తకం పూర్తి చేసే సమయంలోనే ఆ తరువాత దేని మీద చేద్దామా అని ఆలోచిస్తుంటారు. అలా ఆలోచనలోనే ఎక్కువ సమయం గడిచిపోతుంటుంది. దానికి కారణంతో అంటే ఇంతకు ముందు ఎవరు రాసి ఉండకూడదు. అలాంటి సబ్జెక్ట్ వెతకటం నాకు ఎప్పుడూ కత్తి మీద సాము. స్వచ్చమైన నీరుని మనం హిమాలయాల్లోనే చూడగలం. స్వచ్చమైన గాలిని ఉదయం పూట ఆశ్వాదించగలం. ఆ సమయంలో... చల్లటిగాలి... ఖచ్చితంగా ప్రకృతిలో ఫ్యామిలీతో షికార్ వచ్చినట్లు అనిపించింది. ఆరు తరువాత లేచే వారు బైటికిరానివారు ఎంత కోల్పోతున్నారో అర్థం అయ్యింది. రెండు రోజులు పట్టే నా పనుల్ని ఒక్కరోజులోనే చకచకా పూర్తి చేశాను. ఇదే విషయాన్ని నాకు తెలిసిన డాక్టర్ కి చెప్పాను. ఆయన నవ్వి 'నువ్వు ఇంకా వాకింగ్ ని సరయిన పద్ధతిలో చెయ్యలేదు. అలా చేస్తే ఇంకా మంచి ఫలితాన్ని పొందగలవని' చెప్పారు. అనుభూతిని, పనిలో వేగానిని ఇచ్చిన వాకింగ్ ని పర్ ఫెక్ట్ గా ఎందుకు రాయకూడదు, ఆ తరువాత నాలుగు నెలలు కేవలం ఇదే సబ్జెక్ట్ మీద పనిచేశాను. ఇప్పటికి పూర్తి అయ్యింది. ఒక్కటే నేను చెప్పేది. వాక్ చేయండి, సరైన పద్ధతిలో... సరైన సమయంలో... రెగ్యులర్ గా... అప్పుడు మీరు ఏ హాస్పిటల్ గుమ్మం ఎక్కాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఉన్నా ఖచ్చితంగా అది మీకోసం కాదు... - మైథిలీ వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.