వైద్య విజ్ఞానం అపారంగా వృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి సాధిస్తుంది. అలాంటి విజ్ఞానాభివృద్ధి వైద్యులకు మాత్రమే పరిమితమై పోతున్నది. అలోపతీ వైద్య విధానంలో లక్షలాది పరిశోధనశాలల నుండి వచ్చే ఫలితాలను అనేక వైద్య పత్రికలు డాక్టర్లకు అందిస్తున్నాయి. వాటిని అమలు చేస్తుంటారు జ్ఞానతృష్నగల వైద్యులు. సామాన్యులకు... ముఖ్యంగా నవభారతంలో యువతీ, యువకులకు ఆయా వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన శాస్త్ర విజ్ఞానం యొక్క ప్రాథమిక విషయాలు తెలియవలసివున్నది.
విజ్ఞానశాస్త్ర ప్రగతి, వైద్య విజ్ఞానమైనా మరొక శాఖ అయినా తెలుసుకోనందువలన నష్టం అందరికీ ఉంటుంది. ఆధునికమైన వైద్య విధానాన్ని అమలు చేయక డాక్టరు రోగుల్ని కోల్పోతాడు. అవసరమేదో కానిదేదో తెలియక ఏ చికిత్సకు ఎవరు అర్హులో తెలియక రోగి నష్టపోతాడు. జబ్బును బాగు చేసుకోవటం కన్నా జబ్బు రాకుండా నిరోధించడం అత్యవసరం. ఈ విషయాన్ని గురించిన పరిజ్ఞానం అందించటమే ఈ పుస్తకం ఉద్దేశం.
- రాజారామ్ పరుచూరి
వైద్య విజ్ఞానం అపారంగా వృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి సాధిస్తుంది. అలాంటి విజ్ఞానాభివృద్ధి వైద్యులకు మాత్రమే పరిమితమై పోతున్నది. అలోపతీ వైద్య విధానంలో లక్షలాది పరిశోధనశాలల నుండి వచ్చే ఫలితాలను అనేక వైద్య పత్రికలు డాక్టర్లకు అందిస్తున్నాయి. వాటిని అమలు చేస్తుంటారు జ్ఞానతృష్నగల వైద్యులు. సామాన్యులకు... ముఖ్యంగా నవభారతంలో యువతీ, యువకులకు ఆయా వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన శాస్త్ర విజ్ఞానం యొక్క ప్రాథమిక విషయాలు తెలియవలసివున్నది. విజ్ఞానశాస్త్ర ప్రగతి, వైద్య విజ్ఞానమైనా మరొక శాఖ అయినా తెలుసుకోనందువలన నష్టం అందరికీ ఉంటుంది. ఆధునికమైన వైద్య విధానాన్ని అమలు చేయక డాక్టరు రోగుల్ని కోల్పోతాడు. అవసరమేదో కానిదేదో తెలియక ఏ చికిత్సకు ఎవరు అర్హులో తెలియక రోగి నష్టపోతాడు. జబ్బును బాగు చేసుకోవటం కన్నా జబ్బు రాకుండా నిరోధించడం అత్యవసరం. ఈ విషయాన్ని గురించిన పరిజ్ఞానం అందించటమే ఈ పుస్తకం ఉద్దేశం. - రాజారామ్ పరుచూరి© 2017,www.logili.com All Rights Reserved.