ఈ జబ్బులు ఎందుకొస్తాయి?
హైదరాబాద్ జనాభా దాదాపు 70 లక్షలు. ఒక్కో ఇంట్లో నలుగురు మనుషులుంటారనుకుంటే హైదరాబాద్లో దాదాపు 18 లక్షల ఇళ్ళుండాలి. మానవ శరీరంలో దాదాపు 40 లక్షల కోట్ల జీవకణాలు (cells) ఉన్నాయంటారు. ప్రతి జీవకణాన్ని ఒక ఇల్లు అనుకుంటే, మన శరీరంలో దాదాపు 40 లక్షల కోట్ల ఇళ్ళున్నాయన్నమాట. అంటే హైదరాబాద్లోంటి నగరాలు రెండు కోట్లకు పైగా ఇముడుతాయి మన శరీరంలో!
ప్రతి ఇంట్లో రోజూ చాలా వస్తువులు అవసరం అవుతాయి కదా? ముఖ్యంగా పాలు, బియ్యం, కూరగాయలు, పప్పులు, మసాలా దినుసులూ కావాలిగదా? అప్పుడప్పుడూ వీటిని బజారునుంచి తెచ్చుకుంటూ ఉండాలి. వంట చెయ్యాలంటే గాస్ సిలిండర్ (gas cylinder) కావాలి. ఖాళీ సిలిండర్ తిరిగి ఇచ్చెయ్యాలి. ఇవన్నీ రవాణా చెయ్యడానికీ, ఇళ్ళనుంచి చెత్త తీసుకెళ్ళటానికీ రోడ్లు వాహనాలూ ఉండాలి. ఒక ఇంటిని ఒక కణంతో పోల్చినప్పుడు, శరీరంలో కూడా ఈ రోడ్లు, వాహనాలూ, ట్రాఫికూ ఉండాలి కదా?
రోడ్లు చేసేపని మన శరీరంలో రక్త నాళాలు చేస్తాయి. ప్రతి కణానికీ కావాల్సిన ఆహార పదార్థాలు నాళాల్లో ప్రవహించే రక్తం ద్వారా చేరతాయి. ఇక ఈ పదార్థాలను వండుకోవటం గురించీ, వండుకోవటానికి అవసరం అయ్యే గాస్ సిలిండర్ గురించీ మాట్లాడుకుందాం.
మనం తినే పదార్థాల్లో ఎక్కువభాగం రకరకాల పిండి పదార్థాలు (carbohy- drates). అవి జీర్ణం అయినప్పుడు గ్లూకోజ్ మారుతాయి. గ్లూకోజు మన కణాలు వాటికి కావాల్సిన పదార్థాలను తయారు చేసుకోవడానికి వాడుకుంటాయి, లేక దాన్ని తగలబెట్టి అందులోవున్న శక్తిని బయటకులాగి వాడుకుంటాయి. గ్లూకోజ్ని...................
ఈ జబ్బులు ఎందుకొస్తాయి? హైదరాబాద్ జనాభా దాదాపు 70 లక్షలు. ఒక్కో ఇంట్లో నలుగురు మనుషులుంటారనుకుంటే హైదరాబాద్లో దాదాపు 18 లక్షల ఇళ్ళుండాలి. మానవ శరీరంలో దాదాపు 40 లక్షల కోట్ల జీవకణాలు (cells) ఉన్నాయంటారు. ప్రతి జీవకణాన్ని ఒక ఇల్లు అనుకుంటే, మన శరీరంలో దాదాపు 40 లక్షల కోట్ల ఇళ్ళున్నాయన్నమాట. అంటే హైదరాబాద్లోంటి నగరాలు రెండు కోట్లకు పైగా ఇముడుతాయి మన శరీరంలో! ప్రతి ఇంట్లో రోజూ చాలా వస్తువులు అవసరం అవుతాయి కదా? ముఖ్యంగా పాలు, బియ్యం, కూరగాయలు, పప్పులు, మసాలా దినుసులూ కావాలిగదా? అప్పుడప్పుడూ వీటిని బజారునుంచి తెచ్చుకుంటూ ఉండాలి. వంట చెయ్యాలంటే గాస్ సిలిండర్ (gas cylinder) కావాలి. ఖాళీ సిలిండర్ తిరిగి ఇచ్చెయ్యాలి. ఇవన్నీ రవాణా చెయ్యడానికీ, ఇళ్ళనుంచి చెత్త తీసుకెళ్ళటానికీ రోడ్లు వాహనాలూ ఉండాలి. ఒక ఇంటిని ఒక కణంతో పోల్చినప్పుడు, శరీరంలో కూడా ఈ రోడ్లు, వాహనాలూ, ట్రాఫికూ ఉండాలి కదా? రోడ్లు చేసేపని మన శరీరంలో రక్త నాళాలు చేస్తాయి. ప్రతి కణానికీ కావాల్సిన ఆహార పదార్థాలు నాళాల్లో ప్రవహించే రక్తం ద్వారా చేరతాయి. ఇక ఈ పదార్థాలను వండుకోవటం గురించీ, వండుకోవటానికి అవసరం అయ్యే గాస్ సిలిండర్ గురించీ మాట్లాడుకుందాం. మనం తినే పదార్థాల్లో ఎక్కువభాగం రకరకాల పిండి పదార్థాలు (carbohy- drates). అవి జీర్ణం అయినప్పుడు గ్లూకోజ్ మారుతాయి. గ్లూకోజు మన కణాలు వాటికి కావాల్సిన పదార్థాలను తయారు చేసుకోవడానికి వాడుకుంటాయి, లేక దాన్ని తగలబెట్టి అందులోవున్న శక్తిని బయటకులాగి వాడుకుంటాయి. గ్లూకోజ్ని...................© 2017,www.logili.com All Rights Reserved.