కథలు చెప్పకు అంటే కథలల్లకు అనే భావము స్పురిస్తుంది. అయితే ఆకట్టుకునే విధంగా కథలుండాలి అంటే అక్షరాలకు నగిషీలు చెక్కితే చాలదు. అక్షరం మనసును సూటిగా తాకి ఆపై నాటుకుపోవాలి. అదీ కథ! ఇందులో రచించేటప్పుడు రచయిత పొందిన అనుభూతిని, చదివేటప్పుడు పాఠకుడు అస్వాదిస్తాడు. రచయితకు పాఠకుడికి ఏర్పడ్డ ఈ అక్షర వారధిలో కథలోని పాత్రలు హృదయానికి హత్తుకుంటాయి.
ఆ పాత్రల ప్రవర్తన, సంభాషణలు, భావేద్వేగాలు అన్ని అక్షర శిల్పులు చెక్కిన కథ శిల్పాలు, కవులు గీసిన కవితా చిత్రాలు. ఏ కథను చదివినా ఒక్క మెతుకు కాదు ప్రతి మెతుకు పట్టి చూడాలనుకునే మనస్తత్వం ఎన్నో రచనలను చదివించింది. ప్రతి రచనలోను అంతర్లీనంగా ప్రవహించే భావధారలను ఆప్యాయంగా ఒడిసి పట్టుకుని "ఈ కథలో ఏముందో" అని ముందుగా రుచికి కాస్త ఉప్పందించే సమీక్షలను పాఠకులకు అందించే అతి చిన్న ప్రయత్నమిది. నా సమీక్షలు మీ సంవిక్షణకే.
-సి.ఉమాదేవి.
కథలు చెప్పకు అంటే కథలల్లకు అనే భావము స్పురిస్తుంది. అయితే ఆకట్టుకునే విధంగా కథలుండాలి అంటే అక్షరాలకు నగిషీలు చెక్కితే చాలదు. అక్షరం మనసును సూటిగా తాకి ఆపై నాటుకుపోవాలి. అదీ కథ! ఇందులో రచించేటప్పుడు రచయిత పొందిన అనుభూతిని, చదివేటప్పుడు పాఠకుడు అస్వాదిస్తాడు. రచయితకు పాఠకుడికి ఏర్పడ్డ ఈ అక్షర వారధిలో కథలోని పాత్రలు హృదయానికి హత్తుకుంటాయి. ఆ పాత్రల ప్రవర్తన, సంభాషణలు, భావేద్వేగాలు అన్ని అక్షర శిల్పులు చెక్కిన కథ శిల్పాలు, కవులు గీసిన కవితా చిత్రాలు. ఏ కథను చదివినా ఒక్క మెతుకు కాదు ప్రతి మెతుకు పట్టి చూడాలనుకునే మనస్తత్వం ఎన్నో రచనలను చదివించింది. ప్రతి రచనలోను అంతర్లీనంగా ప్రవహించే భావధారలను ఆప్యాయంగా ఒడిసి పట్టుకుని "ఈ కథలో ఏముందో" అని ముందుగా రుచికి కాస్త ఉప్పందించే సమీక్షలను పాఠకులకు అందించే అతి చిన్న ప్రయత్నమిది. నా సమీక్షలు మీ సంవిక్షణకే. -సి.ఉమాదేవి.© 2017,www.logili.com All Rights Reserved.