గుండెపోటు మూడు ప్రధాన కారణాలవల్ల సంభవించవచ్చును.
ఒకటి : గుండె ధమనులు కొలెస్ట్రాల్ వ్యర్థ పదార్ధాలతో పూడి, కరడుగట్టి, పాక్షికంగా కాని, దాదాపు పూర్తిగా కాని పూడిపోయి, గుండె కండరానికి రక్త ప్రసరణను గణనీయంగా అడ్డగించి, గుండె కండరంలో కొంత భాగాన్ని ద్వంసం చేయవచ్చును. ఆకస్మిక మరణానికి కారణం కావచ్చును.
రెండు : గుండె ధమనుల గోడలలో దాగివున్న, తేలికగా చిదికిపోగల, వ్యర్థ పదార్ధాల బుడుగలు చిదికి, కుదపలుగా ఏర్పడి, గుండె కండరానికి రక్త ప్రసరణను ఆకస్మికంగా, పాక్షికంగా కాని పూర్తిగా కాని నిలిపివేసి గుండె కండరంలో కొంత భాగాన్ని ద్వంసం చేయవచ్చును. ఆకస్మిక మరణానికి కారణం కావచ్చును.
మూడు : శాస్త్రపరంగా మనకింకా తెలియని కారణాలవల్ల, గుండె ధమనులలో ఒకటి కాని, అంతకన్న ఎక్కువ కాని, ఆకస్మికంగా ముడుచుకుని రక్త ప్రసరణను పాక్షికంగా కాని పూర్తిగా కాని నిలిపివేసి, గుండె కండరంలో కొంత భాగాన్ని ధ్వంసం చేయవచ్చును. ఆకస్మిక మరణానికి కారణం కావచ్చును.
పై మూడు కారణాలు గుండెపోటుకు చివరి మెట్టు. అంటే చిట్టచివరి కారణాలు. అల్లోపతీ వైద్య చికిత్సా ప్రపంచం గుండె ధమనులు పూడటాన్నే అత్యంత ప్రమాదకరంగా గుర్తించి, యాంజియోప్లాస్టీ, స్టెంట్, బైపాస్ సర్జరీ శస్త్ర చికిత్సలను చేపడుతుంది.
గుండె రక్తనాళాల వ్యవస్థలో చిట్టచివరి కారణాలకు దారితీసే దీర్ఘకాలిక భౌతిక పరిణామాలను గురించి, ఆ భౌతిక పరిణామాలకు మూల కారణాలను గురించి, అల్లోపతీ వైద్య పరిశోధకులే వందల కొలది అధ్యయనాలు ముదింపులు చేశారు. వారి ముదింపుల ప్రకారమే గుండెపోటుకు కారణాలు ఆహార జీవనశైలి అంశాలే. ఈ పుస్తకం ద్వారా గుండె జబ్బులతో బాధపడుతున్న వారికీ, గుండె జబ్బులు రాకుండా ఉండటానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు, జీవనశైలి గురించి, ఆహారపు అలవాట్లును తెలుసుకోవచ్చు.
- డా. జి. లక్ష్మణరావు
గుండెపోటు మూడు ప్రధాన కారణాలవల్ల సంభవించవచ్చును. ఒకటి : గుండె ధమనులు కొలెస్ట్రాల్ వ్యర్థ పదార్ధాలతో పూడి, కరడుగట్టి, పాక్షికంగా కాని, దాదాపు పూర్తిగా కాని పూడిపోయి, గుండె కండరానికి రక్త ప్రసరణను గణనీయంగా అడ్డగించి, గుండె కండరంలో కొంత భాగాన్ని ద్వంసం చేయవచ్చును. ఆకస్మిక మరణానికి కారణం కావచ్చును. రెండు : గుండె ధమనుల గోడలలో దాగివున్న, తేలికగా చిదికిపోగల, వ్యర్థ పదార్ధాల బుడుగలు చిదికి, కుదపలుగా ఏర్పడి, గుండె కండరానికి రక్త ప్రసరణను ఆకస్మికంగా, పాక్షికంగా కాని పూర్తిగా కాని నిలిపివేసి గుండె కండరంలో కొంత భాగాన్ని ద్వంసం చేయవచ్చును. ఆకస్మిక మరణానికి కారణం కావచ్చును. మూడు : శాస్త్రపరంగా మనకింకా తెలియని కారణాలవల్ల, గుండె ధమనులలో ఒకటి కాని, అంతకన్న ఎక్కువ కాని, ఆకస్మికంగా ముడుచుకుని రక్త ప్రసరణను పాక్షికంగా కాని పూర్తిగా కాని నిలిపివేసి, గుండె కండరంలో కొంత భాగాన్ని ధ్వంసం చేయవచ్చును. ఆకస్మిక మరణానికి కారణం కావచ్చును. పై మూడు కారణాలు గుండెపోటుకు చివరి మెట్టు. అంటే చిట్టచివరి కారణాలు. అల్లోపతీ వైద్య చికిత్సా ప్రపంచం గుండె ధమనులు పూడటాన్నే అత్యంత ప్రమాదకరంగా గుర్తించి, యాంజియోప్లాస్టీ, స్టెంట్, బైపాస్ సర్జరీ శస్త్ర చికిత్సలను చేపడుతుంది. గుండె రక్తనాళాల వ్యవస్థలో చిట్టచివరి కారణాలకు దారితీసే దీర్ఘకాలిక భౌతిక పరిణామాలను గురించి, ఆ భౌతిక పరిణామాలకు మూల కారణాలను గురించి, అల్లోపతీ వైద్య పరిశోధకులే వందల కొలది అధ్యయనాలు ముదింపులు చేశారు. వారి ముదింపుల ప్రకారమే గుండెపోటుకు కారణాలు ఆహార జీవనశైలి అంశాలే. ఈ పుస్తకం ద్వారా గుండె జబ్బులతో బాధపడుతున్న వారికీ, గుండె జబ్బులు రాకుండా ఉండటానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు, జీవనశైలి గురించి, ఆహారపు అలవాట్లును తెలుసుకోవచ్చు. - డా. జి. లక్ష్మణరావు
© 2017,www.logili.com All Rights Reserved.