చిన్నయ్య రచన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో దళిత చైతన్య సాహిత్య చరిత్రకు ఓ ముఖ్యమైన ఆధారం కానుంది. మహాత్మ ఫులే, డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ ల లాగా తెలుగు రాష్ట్రాలు ఇంగ్లీషు విద్యావంతులైన దళిత బహుజన నాయకత్వాన్ని సృష్టించకపోయినా మరాఠి తర్వాత తెలుగులోనే శక్తివంతమైన దళిత సాహిత్య సృజన జరిగింది. కోస్తా ప్రాంతంలో వలసవాదం ప్రవేశ పెట్టిన ఆధునిక విద్యావ్యవస్థ, క్రైస్తవ మిషినరీల ప్రభావం చైతన్యవంతమైన ఓ చిన్న దళిత నాయకత్వ బృందాన్ని సృష్టించింది తెలంగాణలో సైతం భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించిన ఆదిహిందూ ఉద్యమం దళిత సాహిత్యాన్ని సృష్టించింది. ఈ విత్తనాలే తర్వాతి కాలంలో ఈ ప్రాంతంలో అంబేద్కరిజం చుట్టూ శక్తివంతమైన ఉద్యమ వృక్షాన్ని ఎలా నిర్మించాయో ఈ రచన వివరిస్తుంది. విద్యార్థులు, సామజిక ఉద్యమకారులు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.