సర్ వాల్డర్ ర్యాలీని లండన్ టవర్ లో నిర్బంధించినపుడు అతడు ప్రపంచ చారిత్ర వ్రాయడం ప్రారంభించాడంటారు। ఒకనాడు అతని గది కిటికీ క్రింద ఒక దెబ్బలాట శబ్దాలని విన్నాడు। బయటికి చూడగా ఒకడు మరొకణ్ణి చంపడం కనిపించింది। ఆ కలహానికి కారణామేమిటో ఆచూకీ తీయ ప్రయత్నించాడు। ఆ జగడానికి మూలమేదో చెప్పమని జైలు అధికారులని మళ్లీ మళ్లీ అడిగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది। వారు అసలు కారణాన్ని చెప్పనేలేదు। తన కిటికీ వద్ద జరిగిన సంఘటనల్లోని నిజానిజాల్ని స్పష్టంగా తెలుసుకోలేని తాను అనేక సంఘటనతో కూడిన చరిత్ర ఎలా వ్రాయడమా అనే సందిగ్ధంలో పడి అసలు గ్రంథ రచన ప్రయత్నాన్నే విరమించుకొన్నాడు। భారతదెశ సంగ్రామ చరిత్రని వ్రాస్తున్న తరుణంలో ఆ కథే నా మనసు లో మెదిలింది। వేల వేల సంవత్సరాల సుదీర్ఘ గాధలోని ప్రతి సంఘటన ఖచ్చితంగా ఎవరికైన ఎట్లా తెలుస్తుంది? కనక, ఈ పుస్తకంలో మన దేశ చరిత్ర రేఖ మాత్రంగానే చెప్పడానికి ప్రయత్నించాను।