'ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సామాజిక వర్గాల ప్రభావం' కొమ్మినేని శ్రీనివాసరావు గారు వ్రాసిన ఈ పుస్తకం, చాలా ఆసక్తికరమైన సత్యాల్ని విపులీకరించింది.
1952 నుండీ - ఏ ప్రాంతంలో ఎన్నికైన వారు ఏ కులానికి చెందిన వారనే విషయం రాబట్టడం అత్యంత ప్రయాసతో కూడిన పని!
ఏ ఏ కులాల వారు - ఏ సమయంలో - ఏ ప్రాంతంలో అత్యధికంగా ఎన్నిక అయ్యారు.. అనే ప్రశ్నకు ఈ పుస్తకం గణాంకాలతో సహా సరైన సమాధానం చెప్తుంది.
రెడ్లు, కమ్మలు ప్రారంభం నుంచీ తమ ప్రభావాన్ని నిలుపుకుంటూనే వచ్చారు. కాంగ్రెస్ లో రెడ్లు, తెలుగుదేశంలో కమ్మలు ఎక్కువగా వున్నా.. వీరిరువురి కలయిక లేకుండా ఎప్పుడు ఏ ప్రభుత్వమూ ఏర్పడలేదు!
కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా, రెండూ ప్రాంతీయ పార్టీలే తలబడ్డాయి. వైసిపిలో 31 మంది రెడ్లు, 3 కమ్మ; టిడిపిలో 9 మంది రెడ్లు, 29 మంది కమ్మ గెలిచారు. 36 రిజర్వుడు స్థానాల్ని మినహాయిస్తే, కమ్మ రెడ్డి కలిపి 52.5% అసెంబ్లీ సీట్లు కలిగియున్నారు.
- కొమ్మినేని శ్రీనివాసరావు