మొదటి ఇంటర్నేషనల్
రాజుల పవిత్ర కూటమి-ప్రతీఘాత ఇంటర్నేషనల్
నెపోలియన్ తో బూర్జువా నియంతృత్వం ప్రారంభమైంది. బూర్జువా విప్లవం సాధించిన ఫలితాలు మాత్రం శాశ్వతమై పోయాయి. ఫ్రాన్సులో భూస్వాముల అధికారం పోయింది, చర్చి ఆధిపత్యం పోయింది. చట్టం ముందు పౌరులు అందరూ సమానం, రాజ్యాంగ బద్ధమైన కోర్టులు న్యాయం నిర్ణయిస్తాయి - అన్న విషయాలు స్థిరమైపోయాయి. ఫ్రాన్సు జయించిన రాజ్యాలన్నిటిలో భూస్వామ్యం కూలదోయ బడ్డది. రాజశాసనం స్థానంలో కోడ్ నెపోలియన్ అన్న బూర్జువా చట్టం అమలులోకి వచ్చింది. జయింపబడిన ఇతర యూరోపియన్ రాజ్యాలలోకూడా ప్రజలు తమ దేశపు రాచరికాన్ని వ్యతిరేకించడం నేర్చుకున్నారు. ఫ్రెంచి ఆక్రమణను ద్వేషించి జాతీయతను, తమ రాజులను ద్వేషించి - ప్రజాస్వామ్య స్ఫూర్తిని (రిపబ్లికనిజంను) అలవరచుకున్నారు. రెండూ ప్రజాస్వామ్య కాంక్షనుండి పుట్టినవే.
ఫ్రెంచి విప్లవాన్ని రద్దు చేసి తిరిగి బూగ్బున్ (Bourbon) వంశపాలనను నిల బెట్టాలని, యూరోపు రాజులు 1792 నుండీ ప్రయత్నించి, చివరకు 1814లో నెపోలియన్ను ఓడించడంలో మాత్రమే సఫలమయ్యారు. కానీ తిరిగి తాము గెలుచుకున్న రాజ్యాలలో వారు ప్రజాస్వామిక విప్లవాలను ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ సమస్యకు పరిష్కారంగా వారందరూ కలిసి, చర్చించి 1815 సెప్టెంబర్ హెూలీ ఎలయన్స్ (పవిత్ర కూటమి)ని ఏర్పాటు చేశారు. నెపోలియన్ యుద్ధాలలో కూలదోసిన రాజకుటుంబాలను తిరిగి నిలబెట్టుట, అన్ని దేశాలలో క్రైస్తవ తేజంతో దైవదత్తమైన రాజాధికారాన్ని స్థాపించుట ఈ పవిత్ర కూటమి యొక్క తత్కాల లక్ష్యం. ఎక్కడ ప్రజాస్వామ్య స్వాతంత్య్ర ప్రతిఘటన తలయెత్తినా ఉమ్మడిగా జోక్యం చేసుకో దానికి తలొక్క రాజు సైన్యాలను కూడా పంపేటట్టు ఏర్పాటు జరిగింది. 1815 నుండి 1849 వరకు హోలీ ఎలయన్సు యూరోపులో అన్ని స్వాతంత్య్ర - ప్రజాస్వామ్య పోరాటాలను హింసతో అణగదొక్కింది. ఈ విధంగా హోలీ ఎలయన్సు విలోమంగా ఏర్పడ్డ తొలిఇంటర్నేషనల్ అనవచ్చు- అనగా ప్రజాస్వామ్య ప్రతీఘాత ఇంటర్నేషనల్, ప్రజాస్వామ్య పోరాటాల అంతర్జాతీయత
ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఆక్రమించబడ్డ దేశాలూ, జాతులూ, కార్మికులతో సహా కొన్ని వర్గాలూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకొరకు, ప్రజాస్వామ్యం కొరకు పోరాటాలు ఆపలేదు. అలాగ ప్రజాస్వామ్యం కొరకు పోరాడుతున్న వారికి హెూలీ ఎలయన్సు నేర్పిన పాఠం ఏమిటంటే - విప్లవ వ్యతిరేక ప్రభుత్వాల కూటమిని ఎదుర్కోడానికి............
మొదటి ఇంటర్నేషనల్ రాజుల పవిత్ర కూటమి-ప్రతీఘాత ఇంటర్నేషనల్ నెపోలియన్ తో బూర్జువా నియంతృత్వం ప్రారంభమైంది. బూర్జువా విప్లవం సాధించిన ఫలితాలు మాత్రం శాశ్వతమై పోయాయి. ఫ్రాన్సులో భూస్వాముల అధికారం పోయింది, చర్చి ఆధిపత్యం పోయింది. చట్టం ముందు పౌరులు అందరూ సమానం, రాజ్యాంగ బద్ధమైన కోర్టులు న్యాయం నిర్ణయిస్తాయి - అన్న విషయాలు స్థిరమైపోయాయి. ఫ్రాన్సు జయించిన రాజ్యాలన్నిటిలో భూస్వామ్యం కూలదోయ బడ్డది. రాజశాసనం స్థానంలో కోడ్ నెపోలియన్ అన్న బూర్జువా చట్టం అమలులోకి వచ్చింది. జయింపబడిన ఇతర యూరోపియన్ రాజ్యాలలోకూడా ప్రజలు తమ దేశపు రాచరికాన్ని వ్యతిరేకించడం నేర్చుకున్నారు. ఫ్రెంచి ఆక్రమణను ద్వేషించి జాతీయతను, తమ రాజులను ద్వేషించి - ప్రజాస్వామ్య స్ఫూర్తిని (రిపబ్లికనిజంను) అలవరచుకున్నారు. రెండూ ప్రజాస్వామ్య కాంక్షనుండి పుట్టినవే. ఫ్రెంచి విప్లవాన్ని రద్దు చేసి తిరిగి బూగ్బున్ (Bourbon) వంశపాలనను నిల బెట్టాలని, యూరోపు రాజులు 1792 నుండీ ప్రయత్నించి, చివరకు 1814లో నెపోలియన్ను ఓడించడంలో మాత్రమే సఫలమయ్యారు. కానీ తిరిగి తాము గెలుచుకున్న రాజ్యాలలో వారు ప్రజాస్వామిక విప్లవాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సమస్యకు పరిష్కారంగా వారందరూ కలిసి, చర్చించి 1815 సెప్టెంబర్ హెూలీ ఎలయన్స్ (పవిత్ర కూటమి)ని ఏర్పాటు చేశారు. నెపోలియన్ యుద్ధాలలో కూలదోసిన రాజకుటుంబాలను తిరిగి నిలబెట్టుట, అన్ని దేశాలలో క్రైస్తవ తేజంతో దైవదత్తమైన రాజాధికారాన్ని స్థాపించుట ఈ పవిత్ర కూటమి యొక్క తత్కాల లక్ష్యం. ఎక్కడ ప్రజాస్వామ్య స్వాతంత్య్ర ప్రతిఘటన తలయెత్తినా ఉమ్మడిగా జోక్యం చేసుకో దానికి తలొక్క రాజు సైన్యాలను కూడా పంపేటట్టు ఏర్పాటు జరిగింది. 1815 నుండి 1849 వరకు హోలీ ఎలయన్సు యూరోపులో అన్ని స్వాతంత్య్ర - ప్రజాస్వామ్య పోరాటాలను హింసతో అణగదొక్కింది. ఈ విధంగా హోలీ ఎలయన్సు విలోమంగా ఏర్పడ్డ తొలిఇంటర్నేషనల్ అనవచ్చు- అనగా ప్రజాస్వామ్య ప్రతీఘాత ఇంటర్నేషనల్, ప్రజాస్వామ్య పోరాటాల అంతర్జాతీయత ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఆక్రమించబడ్డ దేశాలూ, జాతులూ, కార్మికులతో సహా కొన్ని వర్గాలూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకొరకు, ప్రజాస్వామ్యం కొరకు పోరాటాలు ఆపలేదు. అలాగ ప్రజాస్వామ్యం కొరకు పోరాడుతున్న వారికి హెూలీ ఎలయన్సు నేర్పిన పాఠం ఏమిటంటే - విప్లవ వ్యతిరేక ప్రభుత్వాల కూటమిని ఎదుర్కోడానికి............© 2017,www.logili.com All Rights Reserved.