భగవంతుడు ఉన్నాడు, ఆయన్ను దర్శించవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు అన్న దాన్ని తమ జీవితంలో నిరూపించినవారు శ్రీరామకృష్ణులు. ఇందుకోసం ఆయన తమ జీవితాన్నే ఒక ప్రయోగ క్షేత్రంగా చేసుకొన్నారు. శాక్తం, వైష్ణవం అంటూ హిందూమతంలోని వివిధ శాఖలు పేర్కొనే సాధన పద్ధతులనూ, అలాగే క్రైస్తవం, ఇస్లాం అనే పరమతాల సాధనలనూ ఆయన అనుష్టించారు.
కఠోర సాధనలు సలిపారు. తత్ఫలితంగా అన్ని మతాలూ, సంప్రదాయాలూ భగవంతుని పొందడానికి మార్గాలే అన్న సత్యాన్ని నిరూపించి, 'ఎన్ని మతాలో, అన్ని మార్గాలు' అనే సర్వమత సామరస్య భావాన్ని ప్రపంచానికి చాటారు. ఏ మార్గం అన్నది ప్రధానం కాదు. ఆ మార్గాన్ని ఎంతవరకు శ్రద్ధతో, చిత్తశుద్ధితో అనుసరించి ఆచరిస్తున్నాం అన్నదే ప్రధానం. అన్ని మతాలూ సత్యమే అని ఘంటాపథంగా చాటిచెప్పిన వారాయన. అందువల్ల ఈ గ్రంథం ఫలానా మతానికి అని కాకుండా మానవాళి కంతటికీ సంబంధించిన విశ్వ వేదంగా భాసిస్తున్నది.
భగవంతుడు ఉన్నాడు, ఆయన్ను దర్శించవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు అన్న దాన్ని తమ జీవితంలో నిరూపించినవారు శ్రీరామకృష్ణులు. ఇందుకోసం ఆయన తమ జీవితాన్నే ఒక ప్రయోగ క్షేత్రంగా చేసుకొన్నారు. శాక్తం, వైష్ణవం అంటూ హిందూమతంలోని వివిధ శాఖలు పేర్కొనే సాధన పద్ధతులనూ, అలాగే క్రైస్తవం, ఇస్లాం అనే పరమతాల సాధనలనూ ఆయన అనుష్టించారు. కఠోర సాధనలు సలిపారు. తత్ఫలితంగా అన్ని మతాలూ, సంప్రదాయాలూ భగవంతుని పొందడానికి మార్గాలే అన్న సత్యాన్ని నిరూపించి, 'ఎన్ని మతాలో, అన్ని మార్గాలు' అనే సర్వమత సామరస్య భావాన్ని ప్రపంచానికి చాటారు. ఏ మార్గం అన్నది ప్రధానం కాదు. ఆ మార్గాన్ని ఎంతవరకు శ్రద్ధతో, చిత్తశుద్ధితో అనుసరించి ఆచరిస్తున్నాం అన్నదే ప్రధానం. అన్ని మతాలూ సత్యమే అని ఘంటాపథంగా చాటిచెప్పిన వారాయన. అందువల్ల ఈ గ్రంథం ఫలానా మతానికి అని కాకుండా మానవాళి కంతటికీ సంబంధించిన విశ్వ వేదంగా భాసిస్తున్నది.© 2017,www.logili.com All Rights Reserved.