ఇది ఒక ధర్మవీరుడి కథ. ఇంతకు ముందు కొన్ని రచనల్లాగే ఇది కూడా అనుకోకుండా రాసిన పుస్తకం. 'చౌరీ చౌరా'లో ఆగిన 'మన మహాత్ముడు'కు కొనసాగింపుగా అల్లూరి నుంచి నేతాజీదాకా జాతీయోద్యమాన్ని సింహవలోకన చేద్దామని ఉపక్రమిస్తే సీతారామరాజే ఒక పుస్తకమయ్యాడు. తరువాయి చరిత్ర ఎప్పుడు అని చదువరులు తొందర పెట్టగా శ్రద్ధానందాతో శ్రీకారం చుట్టాను.
రెండు మూడు అధ్యాయాల్లో ముగించి, తదుపరి అంకం అందుకుందామనుకుంటే అయ్యే పనిగా తోచలేదు. ఇంటర్నెట్ లో దొరికిన కొద్దిపాటి సమాచారం సారంతీసి, అనేక ఇతర గ్రంథాల్లో అరకొరగా దొరికిన పాయింట్లను దగ్గర చేర్చి, జాతీయ దృక్కోణం నుంచి అవలోకిస్తే ఒక అపురూప ధర్మశక్తి పొడగట్టింది. దానికి అక్షర రూపమే మీ చేతుల్లోని ఈ పుస్తకం.
ఇది ఒక ధర్మవీరుడి కథ. ఇంతకు ముందు కొన్ని రచనల్లాగే ఇది కూడా అనుకోకుండా రాసిన పుస్తకం. 'చౌరీ చౌరా'లో ఆగిన 'మన మహాత్ముడు'కు కొనసాగింపుగా అల్లూరి నుంచి నేతాజీదాకా జాతీయోద్యమాన్ని సింహవలోకన చేద్దామని ఉపక్రమిస్తే సీతారామరాజే ఒక పుస్తకమయ్యాడు. తరువాయి చరిత్ర ఎప్పుడు అని చదువరులు తొందర పెట్టగా శ్రద్ధానందాతో శ్రీకారం చుట్టాను. రెండు మూడు అధ్యాయాల్లో ముగించి, తదుపరి అంకం అందుకుందామనుకుంటే అయ్యే పనిగా తోచలేదు. ఇంటర్నెట్ లో దొరికిన కొద్దిపాటి సమాచారం సారంతీసి, అనేక ఇతర గ్రంథాల్లో అరకొరగా దొరికిన పాయింట్లను దగ్గర చేర్చి, జాతీయ దృక్కోణం నుంచి అవలోకిస్తే ఒక అపురూప ధర్మశక్తి పొడగట్టింది. దానికి అక్షర రూపమే మీ చేతుల్లోని ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.