Bharatha Desapu Vaccine Charitra

By Sajjan Singh Yadav (Author)
Rs.300
Rs.300

Bharatha Desapu Vaccine Charitra
INR
MANIMN4304
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అధ్యాయం - 1
కౌపాక్స్ నుంచి కోవిడ్ - 19 దాకా

         అది 1765 లో జూన్లో, ఒక చక్కని మధ్యాహ్నం. ఇంగ్లండ్, గ్లాసెస్టర్పైర్ దక్షిణ భాగంలో బ్రిస్టల్ పక్కన సోడ్బారీ మార్కెట్ టౌన్, కార్యకలాపాలతో కళకళలాడుతున్నది. ప్రజలంతా స్థానిక వ్యవసాయ ఉత్పత్తులను, అప్పుడే వండిన ఆహారాన్ని కొంటున్నారు. పిల్లలు ఆనందంగా కార్న్ హోల్, క్వోయిట్స్, క్రోక్వే, లాన్ఫ్రాబుల్ ఆడుతున్నారు.

         అదే సమయంలో ఒక చిన్న అమ్మాయి డేనియెల్ లుడ్లో అనే సర్జన్ వైద్యశాలకు వెళ్లింది. ఆమె ఉంది. చేతులమీద దద్దులు పుట్టాయి.

         ఇద్దరూ ఆ జబ్బు లక్షణాల గురించి మాట్లాడుతున్నారు. తనకు ముఖం మీద మచ్చలు అసలు యిష్టంలేదని ఆ అమ్మాయి అంటున్నది.

         'మచ్చలెందుకు?' ముఖంలో ప్రశ్నలు కనబడుతూ అడిగాడు వైద్యుడు.
         'నాకు మశూచి ఎప్పుడూ రాదుమరి', అన్నది అమ్మాయి యికిలిస్తూ.
         'ఆ సంగతి నీకెట్లా తెలుసు?' డాక్టర్, సరదాగా అడిగాడు.
         'ఎందుకంటే నేను డెయిరీలో పనిచేస్తాను గదా, అక్కడ నాకు కౌపాక్స్ వచ్చింది. చేతులు 5. మీద దద్దులు పుట్టాయి మరి' అన్నది అమ్మాయి నమ్మపలుకుతూ.

         కౌపాక్స్క, స్మాల్ పాక్స్క మధ్య సంబంధం డేనియెల్ లుడ్లోకు అర్థంకాలేదు. మిగతా - పేషెంట్లు వేచి వున్నందుకు, అతను అమ్మాయిని పోనిచ్చాడు. మందులేవో రాసి యిచ్చి పంపాడు.

         ఈ సంభాషణ ఎడ్వర్డ్ జెన్నర్ మెదడులో దూరింది. అతను క్లినిక్లో అప్రెంటిస్ మరి. సహాయంగా ఉంటాడు. లుడ్ కు అసిస్ట్ చేస్తూ అతనక్కడ ఎనిమిది ఏండ్లు పనిచేశాడు. తరువాత పల్లె ప్రాంతంలో స్వంత ప్రాక్టీస్ ప్రారంభించాడు. కౌపాక్స్ వచ్చిన వారికి జీవితాంతం మశూచి నుంచి రక్షణ వుంటుందని జనం చెప్పే కథలు అతను విన్నాడు. పాలమ్మాయిలందరూ మచ్చలేని ముఖాలతో వుండడానికి అదే కారణం అని అందరూ నమ్మేవారు.

         కౌపాక్స్ అన్నది ఆవులకు వచ్చే మామూలు వ్యాధి. దానితో వాటి పొదుగుల మీద పుళ్లుపడి రసి కారుతుండేది. ఆవుల నుంచి నేరుగా, లేదా జబ్బు అంటిన మనుష్యుల నుంచి |అందరికీ ఇన్ఫెక్షన్ వ్యాపించేది. కొంచెం జ్వరం, ఒళ్లు నొప్పులు, చాలా తక్కువ సంఖ్యలో పొక్కులు, సాధారణంగా చేతులమీద, ఇవి దాని లక్షణాలు.............

27 సజ్జన్ సింగ్ యాదవ్

అధ్యాయం - 1 కౌపాక్స్ నుంచి కోవిడ్ - 19 దాకా          అది 1765 లో జూన్లో, ఒక చక్కని మధ్యాహ్నం. ఇంగ్లండ్, గ్లాసెస్టర్పైర్ దక్షిణ భాగంలో బ్రిస్టల్ పక్కన సోడ్బారీ మార్కెట్ టౌన్, కార్యకలాపాలతో కళకళలాడుతున్నది. ప్రజలంతా స్థానిక వ్యవసాయ ఉత్పత్తులను, అప్పుడే వండిన ఆహారాన్ని కొంటున్నారు. పిల్లలు ఆనందంగా కార్న్ హోల్, క్వోయిట్స్, క్రోక్వే, లాన్ఫ్రాబుల్ ఆడుతున్నారు.          అదే సమయంలో ఒక చిన్న అమ్మాయి డేనియెల్ లుడ్లో అనే సర్జన్ వైద్యశాలకు వెళ్లింది. ఆమె ఉంది. చేతులమీద దద్దులు పుట్టాయి.          ఇద్దరూ ఆ జబ్బు లక్షణాల గురించి మాట్లాడుతున్నారు. తనకు ముఖం మీద మచ్చలు అసలు యిష్టంలేదని ఆ అమ్మాయి అంటున్నది.          'మచ్చలెందుకు?' ముఖంలో ప్రశ్నలు కనబడుతూ అడిగాడు వైద్యుడు.         'నాకు మశూచి ఎప్పుడూ రాదుమరి', అన్నది అమ్మాయి యికిలిస్తూ.         'ఆ సంగతి నీకెట్లా తెలుసు?' డాక్టర్, సరదాగా అడిగాడు.         'ఎందుకంటే నేను డెయిరీలో పనిచేస్తాను గదా, అక్కడ నాకు కౌపాక్స్ వచ్చింది. చేతులు 5. మీద దద్దులు పుట్టాయి మరి' అన్నది అమ్మాయి నమ్మపలుకుతూ.          కౌపాక్స్క, స్మాల్ పాక్స్క మధ్య సంబంధం డేనియెల్ లుడ్లోకు అర్థంకాలేదు. మిగతా - పేషెంట్లు వేచి వున్నందుకు, అతను అమ్మాయిని పోనిచ్చాడు. మందులేవో రాసి యిచ్చి పంపాడు.          ఈ సంభాషణ ఎడ్వర్డ్ జెన్నర్ మెదడులో దూరింది. అతను క్లినిక్లో అప్రెంటిస్ మరి. సహాయంగా ఉంటాడు. లుడ్ కు అసిస్ట్ చేస్తూ అతనక్కడ ఎనిమిది ఏండ్లు పనిచేశాడు. తరువాత పల్లె ప్రాంతంలో స్వంత ప్రాక్టీస్ ప్రారంభించాడు. కౌపాక్స్ వచ్చిన వారికి జీవితాంతం మశూచి నుంచి రక్షణ వుంటుందని జనం చెప్పే కథలు అతను విన్నాడు. పాలమ్మాయిలందరూ మచ్చలేని ముఖాలతో వుండడానికి అదే కారణం అని అందరూ నమ్మేవారు.          కౌపాక్స్ అన్నది ఆవులకు వచ్చే మామూలు వ్యాధి. దానితో వాటి పొదుగుల మీద పుళ్లుపడి రసి కారుతుండేది. ఆవుల నుంచి నేరుగా, లేదా జబ్బు అంటిన మనుష్యుల నుంచి |అందరికీ ఇన్ఫెక్షన్ వ్యాపించేది. కొంచెం జ్వరం, ఒళ్లు నొప్పులు, చాలా తక్కువ సంఖ్యలో పొక్కులు, సాధారణంగా చేతులమీద, ఇవి దాని లక్షణాలు............. 27 సజ్జన్ సింగ్ యాదవ్

Features

  • : Bharatha Desapu Vaccine Charitra
  • : Sajjan Singh Yadav
  • : Alakananda Prachuranalu
  • : MANIMN4304
  • : paparback
  • : April 2023
  • : 203
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bharatha Desapu Vaccine Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam