ఆసియా దేశాల సమాజాల ప్రత్యేకతలను, సంక్లిష్టతలను గుర్తించిన మార్క్స్ వాటిని ఆసియా తరహా ఉత్పత్తి విధానాలు అని అన్నప్పటికీ ఈ అవగాహన కూడ అన్ని సంక్లిష్టతలను తనలో ఇముడ్చుకోలేదన్న విషయాన్ని గుర్తించాడు. తన జీవితకాలం చివరి దశాబ్దంలో ఈ అంశంపైనే ఆయన విస్తృతంగా అధ్యయనం చేశాడు. ఈ సంగతి ఇటీవలి కాలంలో వెలుగుచూసిన ఆసంపూర్ణ నోట్ బుక్స్ మూలంగా బయటపడింది. అంతేకాదు, డిడి కొశాంబి, ఆర్ఎస్ శర్మ, ఇర్ఫాన్ హబీబ్ లాంటి భారతదేశంలోని మార్క్సిస్టు మేధావులు భారత దేశ చరిత్ర పట్ల మార్పిస్తు అవగాహనకు సమగ్రత చేకూర్చే ప్రయత్నంలో ఆసియా తరహా ఉత్పత్తి విధానం పరిధికి మించి ఉన్న భారతీయ సమాజ పరిణామ ప్రత్యేకలను గుర్తించి, నమోదు చేసి వ్యాఖ్యానించటంలో మరికొన్ని ముందడుగులు వేశారు. వీరితో పాటు ఇఎంఎస్ నంబూద్రిపాద్ లాంటి కమ్యూనిస్టు మేధావులు కూడ భారతదేశ చరిత్రపట్ల మార్క్సిస్టు అవగాహనను సుసంపన్నం చేయడంలో తమవంతు కృషి చేశారు. ఈ అంశాలన్నింటినీ ఈ పుస్తకంలోని వ్యాసాలు వివరిస్తాయి.