భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో దాచేస్తే దాగని సత్యం. పదివేల మందికి పైగా బస్తర్ మూలవాసులు బ్రిటిష్ పెత్తనాన్ని ప్రతిఘటిస్తూ పోరాటంలో అమరులయిన సంఘటన. మరెన్నో వందల మందిపై రాజద్రోహం నేరం మోపి జీవిత ఖైదీలుగా జైళ్ళల్లో బంధించిన వైనం. చివరికి జైళ్ళల్లో స్థలం లేక ఇంకెందరినో కొరడాలతో కొట్టి కఠిన శిక్ష విధించి శారీరకంగా దుర్బరులను చేసిన సన్నివేశం. స్వాతంత్ర్యోద్యమ ప్రభావానికి ముందే గ్రామీణ ప్రాంతాలలో ఆంగ్లేయుల పాలన పట్ల ఏహ్యభావంతో వెల్లుబికిన పోరాటతత్వానికి నిలువెత్తు సాక్ష్యం. మరఫిరంగుల, తుపాకి తూటాల ముందు ఆదివాసుల విల్లంబులు తుత్తినియలయినా మొక్కవోని ఆత్మస్థైర్యంతో బ్రిటిష్ అధికారులను నిలువరించి బస్తర్ గిరిజనులు. సహచరుడు శత్రువు పంచన చేరి నిలువునా మోసం చేసి విప్లవయోధులను మత్తులో ముంచి మృత్యువు పాలు చేసినా తలవొగ్గకుండా అరణ్యాలలోకి నిష్క్రమించి చరిత్రలో పురాణ పురుషుడుగా మిగిలిపోయిన విప్లవ వీరుడు గుండాధూర్. మట్టిలో కలిసిపోయిన మాణిక్యాలను వెలికి దీసి భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రకు కొత్త వెలుగులతో మెరుగులు దిద్దిన పుస్తకం ఇది.
- హెచ్. ఎల్. శుక్లా