భారతీయ దర్శనాలలో మొదటి దర్శనం చార్వాకదర్శనం. ఈ దర్శనాన్ని అధ్యయనం చేయడం వలన భారతదేశంలోని ఆదిమజాతుల తాత్విక దృక్పథం అవగతమవుతుంది. శాస్త్రీయమైన, చారిత్రకమైన భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్వాకుల ప్రభావం భారతీయ తాత్వికులపైనే గాక మొత్తం ప్రపంచ దార్శనికుల మీద బలంగా ఉంది. ఈ దర్శనాన్ని తమ పూర్వికులు రూపొందించినదిగా దళితులూ ఈ యుగంలోనే గుర్తిస్తున్నారు. ఈ చార్వాక దర్శనాన్ని దళిత మేధావి, తాత్వికుడు, కవి, ప్రజా నాయకుడు అయిన శ్రీ కత్తి పద్మారావు గారు ప్రతిభావంతంగా రాయగలిగారు. ఆయన ఈ గ్రంథానికి రాసిన సుదీర్ఘమైన పీఠిక భారత తాత్విక దృక్పథాన్ని ఒక చారిత్రిక క్రమంలో పాఠకులకు అందిస్తుంది. అందుకే ఈ గ్రంథం దళిత, బలహీన, మైనారిటీ వర్గాల విముక్తి పోరాటానికి తాత్విక ఆయుధాన్ని అందించగలదని ఆశిస్తున్నాము.
- ప్రచురణ కర్తలు
భారతీయ దర్శనాలలో మొదటి దర్శనం చార్వాకదర్శనం. ఈ దర్శనాన్ని అధ్యయనం చేయడం వలన భారతదేశంలోని ఆదిమజాతుల తాత్విక దృక్పథం అవగతమవుతుంది. శాస్త్రీయమైన, చారిత్రకమైన భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్వాకుల ప్రభావం భారతీయ తాత్వికులపైనే గాక మొత్తం ప్రపంచ దార్శనికుల మీద బలంగా ఉంది. ఈ దర్శనాన్ని తమ పూర్వికులు రూపొందించినదిగా దళితులూ ఈ యుగంలోనే గుర్తిస్తున్నారు. ఈ చార్వాక దర్శనాన్ని దళిత మేధావి, తాత్వికుడు, కవి, ప్రజా నాయకుడు అయిన శ్రీ కత్తి పద్మారావు గారు ప్రతిభావంతంగా రాయగలిగారు. ఆయన ఈ గ్రంథానికి రాసిన సుదీర్ఘమైన పీఠిక భారత తాత్విక దృక్పథాన్ని ఒక చారిత్రిక క్రమంలో పాఠకులకు అందిస్తుంది. అందుకే ఈ గ్రంథం దళిత, బలహీన, మైనారిటీ వర్గాల విముక్తి పోరాటానికి తాత్విక ఆయుధాన్ని అందించగలదని ఆశిస్తున్నాము. - ప్రచురణ కర్తలు© 2017,www.logili.com All Rights Reserved.