మధ్యతరగతి సంఖ్యను 60 శాతానికి పెంచాలి
అయిదు వేల ఏళ్ల అవిచ్ఛిన్న ప్రస్థానంలో భారతదేశం ఎన్నో మైలురాళ్లను దాటింది. కొన్ని సందర్భాల్లోనైనా సమీక్షలు జరుపుకోవటం వల్ల సవాళ్లను, సంక్షోభాలను అధిగమించే సామర్థ్యాన్ని సంతరించుకుంది. ఇటీవల స్వాతంత్య్ర అమృత మహోత్సవ మైలురాయిని కూడా దాటాం. అవన్నీ ఒక ఎత్తు అయితే, వచ్చే 25 ఏళ్ల పాటు భారత్ ముందున్న అవకాశాలు, లక్ష్యం మరో ఎత్తు! బహుశా మానవాళి చరిత్రలోనే ఎన్నడూ లేనిస్థాయి అవకాశాల్ని అందిపుచ్చుకుని చిట్టచివరి భారతీయునికి కూడా ఆత్మగౌరవంతో ఎదిగే జీవితాన్ని అందించగల అద్భుతావకాశం ఈవేళ భారత్ ముందుంది. ఎన్నో యుగాలుగా, తరాలుగా ఎందరో దార్శనికులు, సంస్కర్తలు, నాయకులు ప్రవచించిన, తపించిన ఆ గొప్ప లక్ష్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చగల సందర్భం భారత్ను ఊరిస్తోంది. తుమ్మల కిశోర్ గారి పుస్తకాన్ని ఈ నేపథ్యంలో చూడాలి.
డబ్బు ఉంటేనే ప్రభుత్వాలు, సుపరిపాలన, ఎదిగే అవకాశాలు. అందుకే వచ్చే రెండు మూడు దశాబ్దాల్లో భారత్ ఆర్థిక వృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను 'దేశ ఆర్థిక ప్రస్థానంలో ఎన్నెన్నో మైలురాళ్ళు.. సంక్షోభాలు - సంస్కరణలు'లో కిశోర్ వివరించే ప్రయత్నం చేశారు.
ఇందులో భాగంగా.. కొవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఉత్పాతాలు, వాటి నుంచి భారత్ కి అంతర్జాతీయంగా, దేశీయంగా ఎదురువుతున్న సవాళ్లు, వీటన్నిటి మధ్య కూడా మన దేశానికున్న సానుకూల అవకాశాలు, ఈ అవకాశాల్ని వినియోగించుకోవటానికి చేపట్టాల్సిన చర్యలను తెలియచేశారు.
గత 75 ఏళ్లుగా మన దేశంలో చోటుచేసుకుంటున్న వివిధ ఆర్థిక పరిణామాల్ని కూడా రంగాలవారీగా కిశోర్ వివరించారు. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం,.............
మధ్యతరగతి సంఖ్యను 60 శాతానికి పెంచాలి అయిదు వేల ఏళ్ల అవిచ్ఛిన్న ప్రస్థానంలో భారతదేశం ఎన్నో మైలురాళ్లను దాటింది. కొన్ని సందర్భాల్లోనైనా సమీక్షలు జరుపుకోవటం వల్ల సవాళ్లను, సంక్షోభాలను అధిగమించే సామర్థ్యాన్ని సంతరించుకుంది. ఇటీవల స్వాతంత్య్ర అమృత మహోత్సవ మైలురాయిని కూడా దాటాం. అవన్నీ ఒక ఎత్తు అయితే, వచ్చే 25 ఏళ్ల పాటు భారత్ ముందున్న అవకాశాలు, లక్ష్యం మరో ఎత్తు! బహుశా మానవాళి చరిత్రలోనే ఎన్నడూ లేనిస్థాయి అవకాశాల్ని అందిపుచ్చుకుని చిట్టచివరి భారతీయునికి కూడా ఆత్మగౌరవంతో ఎదిగే జీవితాన్ని అందించగల అద్భుతావకాశం ఈవేళ భారత్ ముందుంది. ఎన్నో యుగాలుగా, తరాలుగా ఎందరో దార్శనికులు, సంస్కర్తలు, నాయకులు ప్రవచించిన, తపించిన ఆ గొప్ప లక్ష్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చగల సందర్భం భారత్ను ఊరిస్తోంది. తుమ్మల కిశోర్ గారి పుస్తకాన్ని ఈ నేపథ్యంలో చూడాలి. డబ్బు ఉంటేనే ప్రభుత్వాలు, సుపరిపాలన, ఎదిగే అవకాశాలు. అందుకే వచ్చే రెండు మూడు దశాబ్దాల్లో భారత్ ఆర్థిక వృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను 'దేశ ఆర్థిక ప్రస్థానంలో ఎన్నెన్నో మైలురాళ్ళు.. సంక్షోభాలు - సంస్కరణలు'లో కిశోర్ వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. కొవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఉత్పాతాలు, వాటి నుంచి భారత్ కి అంతర్జాతీయంగా, దేశీయంగా ఎదురువుతున్న సవాళ్లు, వీటన్నిటి మధ్య కూడా మన దేశానికున్న సానుకూల అవకాశాలు, ఈ అవకాశాల్ని వినియోగించుకోవటానికి చేపట్టాల్సిన చర్యలను తెలియచేశారు. గత 75 ఏళ్లుగా మన దేశంలో చోటుచేసుకుంటున్న వివిధ ఆర్థిక పరిణామాల్ని కూడా రంగాలవారీగా కిశోర్ వివరించారు. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం,.............© 2017,www.logili.com All Rights Reserved.