"ఇప్పుడు నేను మీ ముందు పెడుతున్న ఈ ప్రయాణo చంద్రమండలం మీదకు కాదు. నక్షత్ర మండలాలకు కూడా కాదు. మన లోపల వున్న దూరాల కంటే ఆ నక్షత్రాలకీ మనకూ మధ్య వున్న దూరమే తక్కువ. మనల్ని మనం ఆవిష్కరించుకోవడం ఒక ముగింపు అంటూ లేనిది. దానికి నిరంతరమైన విచారణ కావాలి. పరిపూర్ణమైన దృష్టిగ్రాహ్యత అవసరం. ఎంపిక చేసుకోవడం లేని ఒక ఎరుక ఉండాలి. వ్యక్తికీ ప్రపంచానికీ వున్న పరస్పర సంబంధంలో నిజంగా తలుపులను తెరవడం వంటిది ఈ ప్రయాణం. మన లోపల మనతో మనకు ఘర్షణ వున్నది కాబట్టి ప్రపంచంలో సంఘర్షణలు ఉంటున్నాయి. మన సమస్యలే విస్తరించుకొని పోయి ప్రపంచ సమస్యలు అవుతున్నాయి. మన లోపల మనం సంఘర్షించుకుంటూ వున్నంతవరకు ఈ ప్రపంచంలో నివాసం కూడా ఒక అంతు లేని సమరంగా విద్వాంసానికీ పతనానికీ దారితీస్తున్న యుద్ధంగా వుండిపోయింది.
- జె. కృష్ణమూర్తి