'హింస' అనేది ఒక సరస్సులోకి జారవిడిచిన రాయి లాంటిది; అలలు ఒక దాని వెనుక ఒకటి వ్యాపిస్తూనే వుంటాయి, 'నేను' అనేదాన్ని కేంద్రంగా కలిగి. సుస్థలంగానో, చాలా సూక్ష్మంగానో, ఏ రూపంలోనైనా 'నేను' అనేది వున్నంతకాలం, హింస వుండి తీరుతుంది.
'హింస' అనే ఇతివృత్తానికి, కృష్ణమూర్తి దాన్ని సమీక్షించిన తీరుకు 1970 సంవత్సరంలో అనేక మంది శ్రోతలను ఉద్ధేశించి అయన మాట్లాడిన సమయంలో ఎంత అవసరం వుండిందో నేటికీ అంతే అవసరం వుంది. హింసయొక్క స్వభావాన్ని చర్చించడంలో హింసతో సన్నిహిత సంబంధంవున్న గాయపడటం, పోటీపడటం, అభద్రత, భయంవంటి మానసిక అంశాల చిక్కుముడులను కూడా కృష్ణమూర్తి విడదీశారు. హింస అనే వాస్తవాన్ని ఖండించకుండా, అణిచివేయకుండా లేదా విశ్లేషించకుండా, దాన్ని నేరుగా చూసే విధానాన్నీ, ఆ విధంగా దానికి అతీతంగా వెళ్లడాన్నీ ఆయన చూపించారు. మనిషి మానసిక తత్త్వంలో నిజమైన ధార్మికతను సూచించే మౌళికమైన మార్పుకోసం ఆయన పిలుపు నిచ్చారు.
ఈ పుస్తకంలో - శాంతా మోనికా, శాన్డియాగో, లండన్, రొమ్లలో జిడ్డు కృష్ణమూర్తిగారు చేసిన అత్యద్భుతమైన ప్రసంగాలు వున్నాయి. శ్రోతల ప్రశ్నలకు ఆయన సమాధానాలు - సందేహాలతో సతమతమవుతున్న వారందరికీ ఆసక్తికరంగా వుండి, నవ్య దృష్టికీ, నూతనోత్తేజానికీ, ఆరంభం పలుకుతాయి.
- జె. కృష్ణమూర్తి