పెట్టుబడిదారీవర్గ తత్వవేత్తలు ఈ సర్వవ్యాపిత సంక్షోభస్థితికి గల కారణాలనూ, ప్రకృతి సమాజ పరిణామ సూత్రాలనూ తెలిసికొనజాలమని నిర్విరామంగా ప్రచారం చేసి, వాస్తవ విషయాలను తెలుసుకొనగోరే పీడిత ప్రజలందరినీ గందరగోళ పరుస్తున్నారు. లక్షలాది సంవత్సరాల క్రితం, రాతి పనిముట్లు, కూచి కర్ర మొదలైన అత్యంత ప్రాథమిక పనిముట్లను మాత్రమే ఉపయోగించి జీవించిన దశ నుండి నేటి వరకు సమాజ పరిణామ క్రమంలో మానవులు పురోభివృద్ధిని సాధిస్తుండగా ప్రకృతి, సమాజ పరిణామ సూత్రాలను అర్థం చేసుకోజాలమని చెప్పడం వాస్తవ విరుద్ధం. ఈ పరిణామ సూత్రాలను తెలుసుకొని వీటి ఆధారంగా ప్రకృతిని, సమాజాన్ని తమ అవసరాలకు తగినట్లు మలచుకొనగల్గిన శక్తిని మానవులు సాధిస్తారు. సమాజ చరిత్రయే దీనికి తార్కాణం.
పెట్టుబడిదారీవర్గ తత్వవేత్తలు ఈ సర్వవ్యాపిత సంక్షోభస్థితికి గల కారణాలనూ, ప్రకృతి సమాజ పరిణామ సూత్రాలనూ తెలిసికొనజాలమని నిర్విరామంగా ప్రచారం చేసి, వాస్తవ విషయాలను తెలుసుకొనగోరే పీడిత ప్రజలందరినీ గందరగోళ పరుస్తున్నారు. లక్షలాది సంవత్సరాల క్రితం, రాతి పనిముట్లు, కూచి కర్ర మొదలైన అత్యంత ప్రాథమిక పనిముట్లను మాత్రమే ఉపయోగించి జీవించిన దశ నుండి నేటి వరకు సమాజ పరిణామ క్రమంలో మానవులు పురోభివృద్ధిని సాధిస్తుండగా ప్రకృతి, సమాజ పరిణామ సూత్రాలను అర్థం చేసుకోజాలమని చెప్పడం వాస్తవ విరుద్ధం. ఈ పరిణామ సూత్రాలను తెలుసుకొని వీటి ఆధారంగా ప్రకృతిని, సమాజాన్ని తమ అవసరాలకు తగినట్లు మలచుకొనగల్గిన శక్తిని మానవులు సాధిస్తారు. సమాజ చరిత్రయే దీనికి తార్కాణం.© 2017,www.logili.com All Rights Reserved.